Khammam Politics: దోస్తీ కొనసాగేనా..! ఖమ్మంలో బీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీల మధ్య టిక్కెట్‌ వార్‌..

|

Apr 02, 2023 | 8:56 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పాలేరు సీటు విషయంలో ఇప్పటికే పొలిటికల్‌గా సెగలు రేగుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్‌. ఇటీవలకాలంలో ఇక్కడ లెప్ట్‌ పార్టీల హడావుడి ఎక్కువైంది.

Khammam Politics: దోస్తీ కొనసాగేనా..! ఖమ్మంలో బీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీల మధ్య టిక్కెట్‌ వార్‌..
Cpi Cpm Brs
Follow us on

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పాలేరు సీటు విషయంలో ఇప్పటికే పొలిటికల్‌గా సెగలు రేగుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్‌. ఇటీవలకాలంలో ఇక్కడ లెప్ట్‌ పార్టీల హడావుడి ఎక్కువైంది. బీఆర్‌ఎస్‌తో స్నేహం చేస్తున్నందున.. పొత్తులు ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈ సీటు తీసుకోవాలని సీపీఎం భావిస్తోంది. సీపీఐ సైతం పలు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సీటు బీఆర్‌ఎస్‌కేనని కమ్యూనిస్టులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో పాలేరు టిక్కెట్‌ విషయంలో తాజాగా తాతా మధు వ్యాఖ్యలు అదే స్పష్టం చేస్తున్నాయి. జీళ్ళ చెరువు సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంపై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దంటూ మధు సూచించారు. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ అంటూ మధు క్లారిటీ ఇచ్చారు. 2023లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉపేందరెడ్డే ఉంటారన్న మధు.. కందాలకు ప్రజలతో పాటు కేసీఆర్‌ ఆశీస్సులున్నాయ్‌ అంటూ పేర్కొన్నారు.

ఇటీవల సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. ఓ మీటింగులో.. లెఫ్ట్‌ పార్టీలపై పాలేరు BRS ఎమ్మెల్యే కందాల సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూ కందాల చేసిన కామెంట్స్‌… కాకరేపాయ్‌. ఏదో ప్రజాచైతన్య యాత్రలు పెట్టి పాలేరు సీటు మాకే అంటున్నారనీ.. పాలేరులో మరోసారి ఖచ్చితంగా తానే పోటీచేస్తాననీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సీటు మనదే.. గెలుపూ మనదే… వార్ వన్ సైడే అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

బీఆర్‌ఎస్‌తో పొత్తులో భాగంగా పాలేరులో పోటీకి సిద్ధమవుతున్న సీపీఎం.. ప్రజా చైతన్యయత్రల పేరుతో యాక్టివ్‌ అయ్యింది. అయితే, మొన్న ఉపేందర్‌రెడ్డి.. ఇప్పుడు తాతా మధు.. పాలేరు టిక్కెట్‌ విషయంలో లెఫ్ట్‌ పార్టీలకు క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. పొలిటికల్‌గా ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..