- Telugu News Photo Gallery Tallest Multi Storied Building in South India is being constructed at Hyderabad IT Corridor
SAS Crown: మేడిన్ హైదరాబాద్.. దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన భవనం మనదగ్గరే.. 236 మీటర్ల ఎత్తులో ఆకాశహర్మ్యం
సౌత్లో ఇండియాలోనే అతిపెద్ద బహుళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మాణం జరుగుతుంది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్ ( SAS Crown )’ పేరి ట ఈ భవనం నిర్మితం అవుతుంది.
Updated on: Apr 02, 2023 | 12:08 PM

సౌత్లో ఇండియాలోనే అతిపెద్ద బహుళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మాణం జరుగుతుంది

కోకాపేటలో ‘సాస్ క్రౌన్ (SAS Crown)’ పేరి ట ఈ భవనం నిర్మితం అవుతుంది.

ఈ భవనన్నీ 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పక్కనే ఉన్న ఈ భవనం ఇప్పటికే 24 అంతస్థుల సుమారు 100 మీటర్ల నిర్మాణం పూర్తయింది.

మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది .

ఐటీ కారిడార్‌లో ఇప్పటికే భారీ బహుళ అంతస్థుల భవనాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.

హైదరాబాద్ .ఐటీ కారిడార్‌లో ‘సాస్ క్రౌన్’ తర్వాత 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.

ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 157 భారీ బహుళ అంతస్థుల భవనాల నిర్మించేందుకు అనుమతులు లభించాయి.

21 నుంచి 58 అంతస్థుల వరుకు ఉండే ఈ భవనాల్లో కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈ భవనాల్లో వ్యాపార సంబంధిత భవనాలతోపాటు నివాస భవనాలు కూడా ఉన్నాయి.
