Donkey Milk: పోషకాలతో కూడిన గాడిద పాలకు యమ గిరాకీ.. లీటరు పాలు వేల ఖరీదు.. ఊరూరా తిరుగుతూ అమ్మకాలు..

| Edited By: Surya Kala

Sep 05, 2023 | 7:53 PM

పాల ధర వేల వరకూ ఉంటుందని మీకు తెలుసా.. వామ్మో ఏంటి పాల ధర ఇంతా .. ఈ పాలకి ఇంత గిరాకీ ఎందుకు అనుకుంటున్నారా.. అవును నిజంగా లీటరు పాల ధర వేల ఖరీదు చేస్తున్నాయి. అందుకే ఖమ్మం జిల్లాలో ఊరూరా తిరుగుతూ గాడిదల పాలు అమ్ముతున్నారు పక్క జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు. ఈ గాడిద పాలను జనాలు ఎగబడీ మరి కొంటున్నారు. ఆయుర్వేద వైద్యంలో ప్రఖ్యాతిగాంచిన గాడిద పాలకు రోజు రోజుకీ  డిమాండ్ పెరిగింది.

Donkey Milk: పోషకాలతో కూడిన గాడిద పాలకు యమ గిరాకీ.. లీటరు పాలు వేల ఖరీదు.. ఊరూరా తిరుగుతూ అమ్మకాలు..
Donkey Milk
Follow us on

ఆవు పాలనో లేదా గేదె పాలనో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. అయితే వీటి పాలు లీటరు రూ. 40 నుంచి రూ.70 లు ఉంటేనే ఆమ్మో అని అంటున్నాం.. అయితే లీటరు పాలు పది వేలు నుంచి పన్నెండు వేలు వరకూ ఉంటుందని మీకు తెలుసా.. వామ్మో ఏంటి పాల ధర ఇంతా .. ఈ పాలకి ఇంత గిరాకీ ఎందుకు అనుకుంటున్నారా.. అవును నిజంగా లీటరు పాల ధర వేల ఖరీదు చేస్తున్నాయి. అందుకే ఖమ్మం జిల్లాలో ఊరూరా తిరుగుతూ గాడిదల పాలు అమ్ముతున్నారు పక్క జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు. ఈ గాడిద పాలను జనాలు ఎగబడీ మరి కొంటున్నారు. ఆయుర్వేద వైద్యంలో ప్రఖ్యాతిగాంచిన గాడిద పాలకు రోజు రోజుకీ  డిమాండ్ పెరిగింది.

ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులు ఊరూరా తిరుగుతూ సంచార జీవులుగా జీవిస్తున్నారు. తమ  జీవనోపాధి కోసం 10 గాడిదలను పెంచుకుంటూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో గ్రామాల్లో సంచరిస్తూ వినూత్నంగా మైకు ద్వారా ప్రచారంతో గాడిదను ఇండ్ల వద్దకు తీసుకువెళ్లి పాలు అవసరమైన వారికి అక్కడే గాడిద నుంచి పాలు తీసి విక్రయిస్తున్నారు. పాలకు అధిక డిమాండ్ ఉండటంతో ఐదు ఎంఎల్ చిన్న గ్లాస్ కు 200 రూపాయలు ధర పలుకుతుందని తెలిపారు. లీటర్ పాలకు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు ధర పలుకుతుంది. అయితే ఈ గాడిద పాలలో అనేక పోషకాలు లభిస్తాయని.. చిన్నారులకు పెద్దలకు ఉబ్బసం, దగ్గు, ఆయాసం వంటి పలు రోగాలు మటుమాయం అవుతాయని వారు అంటున్నారు. ఇప్పటికే చాలా మందికి గాడిద పాలు తాగటం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అయ్యాయని చెబుతున్నారు.

ఈ గాడిదలను పెంచుకొని పాలు విక్రయించటం వలన తమ కుటుంబం సంతోషంగా జీవిస్తున్నామని గాడిదల పాలకు గిరాకీ ఎక్కువగా ఉందని అంటున్నారు. చూడటానికి గాడిదలను తక్కువగా అంచనా వేయొచ్చు కానీ వాటి పాలు మాత్రం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఐదు రోజులు పాటు నివసిస్తామని మరల మరో గ్రామానికి మారుతూ సంచార జీవనం కొనసాగిస్తున్నామని గాడిద పాలు అమ్మే వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..