AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలం గట్లపై నడుస్తూ కనిపించిన వ్యక్తి.. ఎవరా అని ఆరా తీయగా

రైతులు ఎప్పటిలాగే తమ పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా 'టక్ జగదీశ్'లాగ ఓ వ్యక్తి పొలం గట్లపై నడుచుకుంటూ ఓ వ్యక్తి కనిపించాడు. అతడు ఎవరా అని రైతులు ఆరా తీయగా.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీ చూసేద్దాం.

Telangana: పొలం గట్లపై నడుస్తూ కనిపించిన వ్యక్తి.. ఎవరా అని ఆరా తీయగా
Viral
N Narayana Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 12, 2025 | 12:24 PM

Share

జిల్లా పాలన అధికారి అంటే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను పర్యవేక్షిస్తూ ఆయా శాఖల వారు ప్రజలకు జవాబుదారీతనంగా సేవ చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ నిత్యం బిజీగా ఉంటారు. విధి నిర్వహణలో భాగమైన ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటూ ప్రజల నుంచి అర్జీలను(దరఖాస్తులను) స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రజలు, రైతులు తన దృష్టికి సమస్య తీసుకువస్తే చాలు వాటిని తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అధికారులకు. అనంతరం ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వవచ్చు కానీ ఈ కలెక్టర్ అలా కాదు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో రైతుల పొలం గట్లపై క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలు తెలుసుకున్నారు. పంట పొలాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అక్కడున్న రైతులతో ప్రత్యేకంగా కూర్చొని వారిలో ఒకడిగా మాట్లాడారు. ఆయనే ఖమ్మం జిల్లా కలెక్టర ముజ్మిల్ ఖాన్.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ రైతులు సాగు చేసిన పంట పొలాలను తానే స్వయంగా గట్లపై నడుచుకుంటూ పరిశీలించారు. ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల సంరక్షణకు తీసుకుంటున్న రక్షణ చర్యలను రైతులు ఆయనకు వివరించారు. రైతులతో కూర్చొని పంట దిగుబడి, వ్యవసాయ వివరాలను, సమస్యల గురించి రైతులతో కలెక్టర్ మాట్లాడి ఆరా తీశారు.

సాగు నీటి వసతి ఎలా ఉంది.? విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా.? గ్రామాలలో తాగునీటి సరఫరా సరిగ్గా జరుగుతుందా.? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టరే తమ దగ్గరకు వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడంతో రైతులు పాటు స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌తో రుణమాఫీతో పాటు సన్నరకం ధాన్యానికి బోనసు రైతుల ఖాతాలో జమ కావడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకోవచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి