Chicken Price: చికెన్.. చికెన్.. కేజీ రూ.100.. బంపర్ ఆఫర్‌తో పండగ చేసుకుంటున్న జనం..
Chicken Price 100 Rupees: తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది.. కాంగ్రెస్ అత్యధిక సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది.. అయితే, బీజేపీ కూడా 8 సీట్లతో సత్తా చాటింది. దీంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగితెలుతున్నారు. ఈ క్రమంలో చికెన్.. చికెన్.. కేజీ వందే.. వచ్చేయండి.. అంటూ రెండు షాపుల యజమానులు బోర్టులు పెట్టారు. ఇంకేముంది అసలే ఆదివారం.. చల్లని వాతవారణం..
Chicken Price 100 Rupees: తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది.. కాంగ్రెస్ అత్యధిక సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది.. అయితే, బీజేపీ కూడా 8 సీట్లతో సత్తా చాటింది. దీంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగితెలుతున్నారు. ఈ క్రమంలో చికెన్.. చికెన్.. కేజీ వందే.. వచ్చేయండి.. అంటూ రెండు షాపుల యజమానులు బోర్టులు పెట్టారు. ఇంకేముంది అసలే ఆదివారం.. చల్లని వాతవారణం.. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా చికెన్ షాపులకు క్యూ కట్టారు.. అసలు రాజకీయ పార్టీలకు.. చికెన్ ధరకు లింకేంటీ..? అని ఆలోచిస్తున్నారా..? అయితే.. ఈ వార్తను చదవండి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు చికెన్ సెంటర్లు.. అదిరిపోయే ఆఫర్లు పెట్టాయి. కేవలం వంద రూపాయలకే కిలో చికెన్ అంటూ బోర్డు పెట్టడంతో.. చికెన్ ప్రియులు క్యూకట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఒకరు.. బీజేపీ సత్తా చాటిందని మరొకరు.. ఇలా రూ.100కే కిలో చికెన్ అంటూ ఆఫర్లు పెట్టారు. దీంతో ఆయా దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
అయితే, కొందరు బిజినెస్ కోసం ఆఫర్లు ప్రకటిస్తుంటారు.. కానీ.. వీరు మాత్రం తమ పార్టీలు గెలిచాయంటూ ఆఫర్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కార్తీక మాసం ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకప్పుడు 250 నుంచి 300 వరకూ పలికిన కిలో చికెన్ ఇప్పుడు 120 నుంచి 140 రూపాయలు మాత్రమే ఉంది. ధరలు భారీగా తగ్గడంతో చికెన్ లవర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ చికెన్ వ్యాపారులు.. ఇటు బిజినెస్.. అటు అభిమానంతో క్యాష్ చేసుకున్నట్లు చెబుతున్నారు.
వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. చికెన్ ధరలు అమాంతం తగ్గడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటున్నారు. మరో పది పదిహేను రోజుల వరకూ చికెన్ రేట్లు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు తమకు నష్టాలు తప్పవంటున్నారు పౌల్ట్రీ రైతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.