AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్

తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి,..

KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్
Cm KCR
Venkata Narayana
|

Updated on: Jun 20, 2021 | 11:17 PM

Share

CM KCR on NTR : తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.

ఆదివారం సిద్ధిపేటలో కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. తాను పుట్టిన జిల్లా సిద్ధిపేటేనని, తెలంగాణ రాకముందే మిషన్‌ కాకతీయ రూపకల్పన చేశామని చెప్పారు. సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో ధరణి తయారు చేసేందుకు మూడేళ్లు పట్టిందని కేసీఆర్ అన్నారు. రెవెన్యూలో గందరగోళం ఎందుకని నేనే మీటింగ్ పెట్టి ధరణి రూపొందించామని చెప్పుకొచ్చారు. ధరణి వల్ల ఇప్పుడు మూడు రకాలుగా మాత్రమే భూమి వేరే వాళ్ల పేరు మీదకు మారుతుందని అన్నారు. అమ్మడం లేదా కొనడం, వారసత్వం, గిఫ్టులాగా భూమి ఇవ్వడం వల్ల మాత్రమే భూమి మరొకరి పేరు మీదకి మారుతుందని కేసీఆర్ అన్నారు.

”రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు అని చెప్పిన సీఎం , 95 శాతం మంది ఈ సాయం ఉపయోగపడుతోందని, ఎక్కడో ఒకరు మందు తాగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు ఉండగా.. రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయని అన్నారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాదని, అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Read also :  Vijayashanthi : నామమాత్రపు లాక్ డౌన్లతో మమ అనిపించి.. చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ ఎత్తేశారు : విజయశాంతి