Telangana Election: ఎన్నికల వేళ తెరలేచిన పవర్ ఫుల్ యుద్ధం.. కరెంట్‌పై మాటల మంటలు
Telangana Election: పవర్ పాలిటిక్స్‌తో తెలంగాణ హీటెక్కుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ కాకరేపుతోంది. ఓ వైపు కర్నాటక రైతుల వ్యతిరేక ప్రచారం.. మరోవైపు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కౌంటర్స్‌తో కరెంట్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కర్నాటక వెళ్దామని బీఆర్ఎస్ నేతలంటే.. స్పెషల్ బస్సులు పెడతామని డీకే శివకుమార్ చెప్పడంతో కరెంట్‌పై మాటలమంటలు రాజుకుంటున్నాయి.
పవర్ పాలిటిక్స్‌తో తెలంగాణ హీటెక్కుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ కాకరేపుతోంది. ఓ వైపు కర్నాటక రైతుల వ్యతిరేక ప్రచారం.. మరోవైపు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కౌంటర్స్‌తో కరెంట్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కర్నాటక వెళ్దామని బీఆర్ఎస్ నేతలంటే.. స్పెషల్ బస్సులు పెడతామని డీకే శివకుమార్ చెప్పడంతో కరెంట్‌పై మాటలమంటలు రాజుకుంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ పోరు హీట్ పుట్టిస్తోంది. ఐదు గంటల కరెంట్ కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా అని బీఆర్ఎస్ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కర్నాటకలో కరెంట్ కోతలపై మంత్రి కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కర్నాటక రైతుల ప్రచారాన్ని స్పాన్షర్డ్ అంటున్నారని.. కావాలంటే అక్కడకు వెళ్లి చూస్తే నిజాలు తెలుస్తాయన్నారు మంత్రి కేటీఆర్.
అంతకుముందు రెండో విడత కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్ర సందర్భంగా మొదటిరోజు చేవెళ్ల, పరిగి, తాండూర్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. మొదటి రోజు విజయభేరి బస్సు యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసిరారు. కర్నాటక రైతులు తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగితే.. డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కర్నాటకలో రైతులకు 5 గంటల కరెంట్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే కేసీఆర్, కేటీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలన్నారు శివకుమార్. అందుకు ధీటుగా మంత్రి కేటీ రామారావు రియాక్ట్ అయ్యారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాస్టర్ మైండ్ డీకే శివకుమార్‌తో మొదటిరోజు జరిగిన విజయభేరి బస్సు యాత్రలో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి ఇచ్చిన వెంటనే ఇచ్చిన ఐదు హామీలను పూర్తి చేశామని వివరించారు. తాండూర్, పరిగి, చేవెళ్ల కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేక పోతుందని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ఐదు హామీలలో నాలుగు హామీలను అమలు చేశామని క్లారిటీ ఇచ్చారు. ఐదో హామీని డిసెంబర్ నెల కల్లా పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు.
ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ విషపూరిత ప్రచారం చేస్తుందన్న డీకే.. బీఆర్ఎస్ మంత్రులకు ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేస్తానని కర్ణాటకలో వారు కోరుకున్న ప్రదేశానికి తీసుకెళ్తామని, ఇక్కడి ప్రజలతో మాట్లాడి కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేశామో లేదో తెలుసుకోవాలని ఫైర్ అయ్యారు. కర్ణాటకలోని ఐదు హామీల కంటే తెలంగాణలో ప్రకటించిన ఆరు హామీల అద్భుతంగా ఉన్నాయని, ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు దేశం మొత్తానికి రోల్ మోడల్ గా ఉంటాయని చెప్పారు డీకే శివకుమార్.
కార్నర్ మీటింగ్స్‌లో డీకే శివకుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఛాలెంజ్ విసరటం అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో డిసెంబర్ 9 కి కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని, దానికి తెలంగాణ ప్రజల మద్దతు కావాలని అందుకే తాను బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చానని అన్నారు డీకే. రేవంత్ తనకు మంచి మిత్రుడని, రేవంత్‌కి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తాను బలంగా నమ్మి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు శివకుమార్.
డీకే శివకుమార్ విసిరిన ఈ చాలెంజ్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు కర్ణాటకలో కాంగ్రెస్ ఫెయిలైందని బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్‌కి కౌంటర్స్ వెతుక్కున్న కాంగ్రెస్ డీకే శివకుమార్ విసిరిన చాలెంజ్ కౌంటర్ రిప్లైగా కాంగ్రెస్ ఎలా వాడుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…