Telangana: బస్టాండ్ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుంచి బయల్దేరిన కాసేపటికే ఓ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపేసి, ప్రయాణికులను కిందికి దించేయడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుంచి బయల్దేరిన కాసేపటికే ఓ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేయడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళ్తే..సుమారు 41 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి ఓ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్‌కు బయల్దేరింది. ఆ బస్సు తిమ్మాపూర్ మండలం అలుగునూరు పరిధిలోకి రాగానే, ఒక్కసారిగా బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. దీన్ని గమనించిన డ్రైవర్ క్షణాల్లో స్పందించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించేశాడు.
రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ స్థానిక అగ్నిమాపక (ఫైర్) సిబ్బందికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి, రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. అనంతరం ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి, వారిని గమ్యస్థానాలకు పంపించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీడియో చూడండి. .
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
