AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోన్న సామ్.. ‘మా ఇంటి బంగారం’కు 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

అంచనాలకు ఏ మాత్ర తగ్గకుండా సమంత 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం (జూన్ 19) రిలీజైన ఈ సినిమా మొదటి రోజే రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక శనివారం (జూన్ 20) కూడా వీకెండ్ కావడంతో సామ్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి.

Maa Inti Bangaram: బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోన్న సామ్.. 'మా ఇంటి బంగారం'కు 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Maa Inti Bangaram Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 1:21 PM

Share

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సామ్ తోనే జబర్దస్త్ , ఓ బేబీ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. శుక్రవారం (జూన్ 19) రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక శనివారం (జూన్ 20) కూడా వీకెండ్ కావడంతో సామ్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. ఓవరాల్ గా ఈ రెండు రోజులకు కలిపి మా ఇంటి బంగారం సినిమాకు రూ. 28 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంటే శనివారం ఒక్కరోజే సామ్ సినిమాకు రూ. 15 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆదివారం (జూన్ 21) కూడా హాలీడే కావడంతో మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్లు మరింత పెరగ వచ్చని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘మా ఇంటి బంగారం’ కు సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు వన్ మిలియన్ డాలర్ మార్క్ కు చేరువగా ఉన్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, .ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ధ‌ర్మేంద్ర కాక‌ర్ల ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

ఇవి కూడా చదవండి

రెండు రోజుల్లో రూ. 28 కోట్లు..

ఓవర్సీస్ లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?