ఆరోగ్యానికి శత్రువని.. చక్కెరను పూర్తిగా మానేస్తే జరిగేది ఇదే!
21 June 2026
TV9 Telugu
TV9 Telugu
చక్కెర.. మనిషిని నిశ్శబ్దంగా చంపేస్తుంది. అందుకే, పక్కన పెట్టేయాల్సిన పదార్థాల్లో ముందుంటుంది. ఇక ‘షుగర్ ఫ్రీ డైట్’కు ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు ఉంది
TV9 Telugu
చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే.. మధుమేహం మొదలుకొని బరువు తగ్గడం వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ చక్కెరను పూర్తిగా పక్కన పెట్టడం కూడా మంచిదికాదట
TV9 Telugu
తాజా అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వల్ల పేగుల ఆరోగ్యం, జీవక్రియలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందట
TV9 Telugu
మితిమీరిన చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ, కొన్ని రకాల చక్కెరలను పూర్తిగా తొలగించడం వల్ల నష్టమేనట
TV9 Telugu
చక్కెర పూర్తిగా మానేయడం వల్ల ముఖ్యమైన జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని పరిశోధకులు చెప్పుకొచ్చారు
TV9 Telugu
చక్కెరను పూర్తిగా పక్కన పెట్టేస్తే.. రక్తంలో చక్కెర నియంత్రణ తగ్గడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, పేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది
TV9 Telugu
అలాగే పేగుల్లో వాపు, మంటతోపాటు ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. సుక్రోజ్‌ను పూర్తిగా దూరం చేయడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది
TV9 Telugu
చక్కెరను పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. కొద్ది మొత్తానికి పరిమితం చేయాలి. అదే సమయంలో ఆహారంలో కార్బోహైడ్రేట్ల నాణ్యత, సమతుల్యతకూ ప్రాధాన్యం ఇవ్వాలి