చిన్నగా ఉన్నాయ్.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు! అసలు మేటర్ ఇదే
21 June 2026
TV9 Telugu
TV9 Telugu
గసగసాలు సాధారణంగా చల్లదనాన్ని అందించే ఆహార పదార్థంగా ప్రసిద్ధి చెందాయి. అయితే వీటి ప్రయోజనాలు అంతటితో ముగియవు
TV9 Telugu
సరైన మోతాదులో తీసుకుంటే గసగసాలు రాత్రిపూట మంచి నిద్రకు తోడ్పడటంతోపాటు పగటిపూట జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయట
TV9 Telugu
తీవ్రమైన వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి
TV9 Telugu
పోషక విలువలు గసగసాలలో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
గసగసాల నుంచి తీసే నూనెలో కూడా పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, ముఖ్యంగా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి
TV9 Telugu
పరిశోధనల ప్రకారం గసగసాల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థ పనితీరుకు మెరుగుపరుస్తుంది
TV9 Telugu
దీంతో సహజ నిద్ర చక్రం మెరుగుపడే అవకాశం ఉంటుంది. గసగసాల్లో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి
TV9 Telugu
గసగసాలను తీసుకునే విధానంలో కూడా ముఖ్యమే. సాధారణంగా రాత్రంతా నానబెట్టి తీసుకుంటారు. అలాగే పాలలో కలిపి తీసుకుంటే నిద్రకు సహాయపడుతుంది