AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంకపై విధ్వంసం సృష్టించి.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ! కారణం ఏంటంటే?

శ్రీలంకతో ట్రై-నేషన్ ఫైనల్‌లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 324.14 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడాడు. కేవలం ఒక్క షాట్ దూరంలో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కోల్పోయినా, అతని అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా నిలిచింది.

శ్రీలంకపై విధ్వంసం సృష్టించి.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ! కారణం ఏంటంటే?
Vaibhav Suryavanshi
SN Pasha
|

Updated on: Jun 21, 2026 | 1:22 PM

Share

శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతడు, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం ఒక్క షాట్ దూరంలో కోల్పోయాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. 324.14 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ఈ యువ బ్యాటర్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలింగ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశాడు.

భారత్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో శ్రీలంక ‘ఎ’ కెప్టెన్ షహాన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతిని వైభవ్ భారీ షాట్‌గా మలచేందుకు ప్రయత్నించగా, బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఒక్క బంతి సిక్సర్‌గా మారి ఉంటే, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 31 బంతుల రికార్డును అధిగమించే అవకాశం ఉండేది. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ రికార్డుకు కూడా అతడు సవాల్ విసిరే స్థితిలో ఉన్నాడు. అయితే సెంచరీకి అతి చేరువలో అవుట్ అవ్వడంతో పాటు వరల్డ్ రికార్డ్ మిస్ అవ్వడంతో వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, వైభవ్ అవుటైన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ గెలిచినంత ఆనందంతో సంబరాలు చేసుకోవడం అతని ఇన్నింగ్స్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పకనే చెప్పింది. ఫైనల్ వంటి అత్యంత కీలక మ్యాచ్‌లో అతడు అందించిన ఈ మెరుపు ఆరంభం భారత్‌ను బలమైన స్థితిలో నిలబెట్టింది. ఇప్పటికే భారత అండర్-19 జట్టులో తన ప్రతిభను నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ, ఈ ట్రై-నేషన్ సిరీస్‌లోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. సెంచరీ చేజారినా, ఈ 94 పరుగుల ఇన్నింగ్స్ అతడిని భారత క్రికెట్ భవిష్యత్తు తారల్లో ఒకడిగా మరింత బలంగా నిలబెట్టింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!