బాప్‌రే.. అది ఆటోనా లేక బస్సా?

కరీంనగర్‌లో ఓ ఆటో.. 24 మందితో ప్రయాణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టౌన్‌కు చెందిన అబ్దుల్ అనే డ్రైవర్ తన ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తున్నాడు. ఇక మార్గం మధ్యలో ఆటోను ఆపిన పోలీసులు అంతమందిని చూసి షాక్ అయ్యారు. వాహనంలో ఉన్నవారిని ఒక్కొక్కరిగా దింపి లెక్కపెట్టారు. ఇంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు డ్రైవర్‌కు అవగాహన కల్పించారు. కాగా ఈ తతంగాన్ని వీడియో తీసిన కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి ట్విటర్‌లో […]

బాప్‌రే.. అది ఆటోనా లేక బస్సా?
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2019 | 6:54 AM

కరీంనగర్‌లో ఓ ఆటో.. 24 మందితో ప్రయాణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టౌన్‌కు చెందిన అబ్దుల్ అనే డ్రైవర్ తన ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తున్నాడు. ఇక మార్గం మధ్యలో ఆటోను ఆపిన పోలీసులు అంతమందిని చూసి షాక్ అయ్యారు. వాహనంలో ఉన్నవారిని ఒక్కొక్కరిగా దింపి లెక్కపెట్టారు. ఇంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు డ్రైవర్‌కు అవగాహన కల్పించారు. కాగా ఈ తతంగాన్ని వీడియో తీసిన కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి ట్విటర్‌లో షేర్‌ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.