‘కళాతపస్వి’ కి కేసీఆర్ పరామర్శ
తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు ‘ కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా-తాను ఆరోగ్యంగానే ఉన్నానని విశ్వనాథ్ స్పష్టం చేశారు. ‘ ఆత్మగౌరవం ‘ చిత్రంతో మెగాఫోన్ పట్టిన విశ్వనాథ్.. ‘ శంకరాభరణం ‘, ‘ సాగర సంగమం ‘ వంటి అద్భుత కళాఖండాలను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాక..నటుడిగా కూడా వెండి తెరపై […]
తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు ‘ కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా-తాను ఆరోగ్యంగానే ఉన్నానని విశ్వనాథ్ స్పష్టం చేశారు. ‘ ఆత్మగౌరవం ‘ చిత్రంతో మెగాఫోన్ పట్టిన విశ్వనాథ్.. ‘ శంకరాభరణం ‘, ‘ సాగర సంగమం ‘ వంటి అద్భుత కళాఖండాలను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాక..నటుడిగా కూడా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. వయోభారం కారణంగా ఆయన కొంతకాలంగా చిత్రాలకు దూరంగా ఉన్నారు.