Telangana Elections: ఇదిగో మా బలం.. ఆ సీట్లు ఇవ్వాల్సిందే..! కమ్మ నేతల డిమాండ్..
తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలిశారు. సీనియర్ లీడర్ రేణుకా చౌదరి వీరిని లీడ్ చేశారు. ఓవైపు బీసీలకు 34 సీట్లు కేటాయించడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద టాస్క్‌గా కనిపిస్తోంది. పైగా ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా వారికి కేటాయించిన సీట్లు ఇవ్వాల్సిందే. జనరల్ స్థానాల్లో ఎక్కువగా పోటీపడుతున్నది రెడ్డి సామాజికవర్గం వాళ్లే. ఇప్పుడు కమ్మ సామాజికవర్గ నేతలు కూడా పది నుంచి 12 స్థానాలకు పట్టుబడుతుండడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అందులోనూ..

తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గానిదే హవా. ఈసారి బీసీ కార్డ్ కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతోంది. బీసీలకు 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆల్రడీ కమిట్ అయింది. ముఖ్యంగా ముదిరాజ్‌లు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. కులాల ప్రాతిపదికన ఎవరికి వారు రాజకీయ ప్రాధాన్యం కోరుతుండడంతో.. కమ్మ నేతలు కూడా మేముసైతం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కనీసం 10 నుంచి 12 మంది కమ్మ సామాజికవర్గ నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
కేవలం అడిగి ఊరుకోవడం కాదు.. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలిశారు. సీనియర్ లీడర్ రేణుకా చౌదరి వీరిని లీడ్ చేశారు. ఓవైపు బీసీలకు 34 సీట్లు కేటాయించడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద టాస్క్‌గా కనిపిస్తోంది. పైగా ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా వారికి కేటాయించిన సీట్లు ఇవ్వాల్సిందే. జనరల్ స్థానాల్లో ఎక్కువగా పోటీపడుతున్నది రెడ్డి సామాజికవర్గం వాళ్లే. ఇప్పుడు కమ్మ సామాజికవర్గ నేతలు కూడా పది నుంచి 12 స్థానాలకు పట్టుబడుతుండడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
అందులోనూ, బలమైన స్థానాలనే అడుగుతున్నారు. ఖమ్మం, పాలేరు, కోదాడ, మల్కాజిగిరి, బాన్సువాడ, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గాలు కోరుతున్నారు. పర్టిక్యులర్‌గా ఈ స్థానాలే ఎందుకు అడుగుతున్నట్టు? గ్రేటర్ పరిధిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువ వీరిలో అన్ని సామాజికవర్గాలతో పాటు కమ్మ వర్గం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. పైగా ఈసారి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలపై బాగానే ఎఫెక్ట్ చూపబోతోంది. పర్టిక్యులర్‌గా కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. ఈ ఓటర్లందరూ కన్సాలిడేట్ అయి ఏదో ఒక పార్టీకే ఓట్లు వేయాలనే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే, గ్రేటర్‌లో ఎక్కువ స్థానాలు అడుగుతూ, ఖమ్మం, పాలేరు, కోదాడతో పాటు కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండే బాన్సువాడ, సిర్పూర్ కాగజ్‌నగర్ స్థానాలు కూడా అడుగుతున్నారు.
ఇంకా ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం..
బీఆర్‌ఎస్ పార్టీ ఐదుగురు కమ్మ సామాజికవర్గ నేతలకు టికెట్లు ఇచ్చింది. కాని, తెలంగాణలో 5 శాతం జనాభా ఉన్న తమకు ఇంకా ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలంటోంది తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇస్తే అందులో ఐదుగురిని గెలిపించుకున్నామని గుర్తు చేస్తున్నారు. అయితే, ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆల్రడీ అభ్యర్ధులను ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలైనా కమ్మవారికి పది నుంచి 12 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 30 జిల్లాల్లో 45కు పైగా నియోజవవర్గాల్లో తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు కమ్మ వర్గం పెద్దలు. 50వేలకు పైగా ఓట్లు ఉన్న నియోజకవర్గాలు పది వరకు ఉన్నాయని లెక్కలతో సహా చెబుతున్నారు. అయితే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ టికెట్లు కోరుకుంటోంది. బీఆర్ఎస్ ఆల్రడీ టికెట్లు కన్ఫామ్ చేయడంతో ఆ పార్టీ నేతల్లో ఎవరినీ కలవలేదు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు..
బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి హైదరాబాద్‌లోనే ఓ వినతిపత్రం ఇచ్చారు. కాని, కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇలా వ్యవహరించలేదు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసినా.. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. అట్నుంచి అటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. అంటే.. కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ టికెట్లు రావాలని ఆ నేతలు కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. మారిన పరిస్థితులు కూడా ఇందుకు కారణమే. తుమ్మలకు బీఆర్‌ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోవడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ గనక కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తే దాదాపుగా అందరినీ గెలిపించుకుంటామని డైరెక్టుగానే చెబుతున్నారు.
వీరంతా ఏ పార్టీలో ఉన్నారంటే..
నిజానికి తెలంగాణలో కమ్మ సామాజికవర్గ ఓటర్లు బీఆర్‌ఎస్ వైపు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ఓటుబ్యాంక్ అటువైపే ర్యాలీ అయింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో ఉన్న ఈ సామాజికవర్గ ఓటు బ్యాంకు.. గంపగుత్తగా బీఆర్‌ఎస్‌కు పడ్డాయి. దాని ఫలితంగానే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ, సిర్పూర్ కాగజ్ నగర్‌లో కోనేరు కోనప్ప, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కరరావు గెలిచారు. అయితే, మొత్తం ఓట్లను లెక్కగట్టి తమకు బలం ఉన్న స్థానాలను ఫిల్టర్ చేసి 12 నియోజకవర్గాలను ఫైనల్ చేశారు. ఎలాగూ మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. ఆ రెండు పార్టీలకు లేఖలు రాశారు. అసెంబ్లీ టికెట్లతో పాటు రెండు ఎంపీ టికెట్లు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో..
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఈసారి ఏ పార్టీకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఇప్పటివరకు ఈ ఓటర్లు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారు కాబట్టి అలాగే కంటిన్యూ అవ్వాలి. అయితే, చంద్రబాబు అరెస్ట్ విషయంలో అనుసరించిన వ్యూహం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన ఐటీ ఉద్యోగులపై పోలీసు చర్యలు తీసుకోవడం నెగెటివ్‌గా మారిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ అంశంపై ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది. అందుకే, ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం బాన్సువాడలో జరిగిన ఒక కార్యక్రమం చంద్రబాబుపై సానుభూతి ప్రకటించారు.
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు కూడా చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదంటూ మాట్లాడారు. ఖమ్మంలో మంత్రి కేటీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఇవన్నీ కమ్మ సామాజికవర్గ ఓట్ల కోసం జరిగిన కీలక పరిణామాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆ ఓటు బ్యాంకు చేజారకుండా..
ఎందుకంటే, ఎంత లేదన్నా తెలంగాణలో సుమారు 32 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు స్థానాలతో పాటు హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్ చోట్ల ఆ ఓటు బ్యాంకు చేజారకుండా అన్ని పార్టీల అభ్యర్థులు జాగ్రత్తపడుతున్నారు.
మాకు 12 టికెట్లు ఇవ్వండి..
కమ్మ వర్గ నేతలు 12 టికెట్లు అడుగుతున్నారు గానీ.. ఆ నియోజకవర్గాల్లో టికెట్ కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. బాన్సువాడ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కాసుల బాలరాజు పోటీపడుతున్నారు. వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి ఓడినా.. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అయితే, ఓ ఎన్నారై బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ మీద కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాని, రఘునాథ్ యాదవ్, జర్రిపాటి జయపాల్ మధ్యే పోటీ ఉంది. మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ దాదాపుగా మైనంపల్లి హనుమంతరావుకు కన్ఫామ్ అయినట్టే. మేడ్చల్‌లో హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్ మధ్య టికెట్ పోటీ నడుస్తోంది. కుత్బుల్లాపూర్‌లో కొలను హనుమంతురెడ్డి, భూపతిరెడ్డి నరసారెడ్డి మధ్య పోటీ ఉంది. కూకట్‌పల్లి నుంచి శ్రీరంగం సత్యం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్బీనగర్ టికెట్‌ను మల్‌రెడ్డి రాంరెడ్డి ఆశిస్తుండగా.. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ కూడా దరఖాస్తు చేశారు. జూబ్లీహిల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, అజారుద్దీన్ పోటీ పడుతున్నారు. సిర్పూర్ కాంగ్రెస్ టికెట్ కోసం రావి శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు.
ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ సామాజికవర్గాల వారిగా ఎంతమందికి న్యాయం చేస్తుందన్నదే ప్రశ్న. అన్ని సామాజికవర్గాలూ తమకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. కాని, అందరికీ అడిగినన్ని టికెట్లు ఇవ్వగలదా? ఇస్తే ఓకే.. అలా జరక్కపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకే నెగటివ్‌గా మారే అవకాశాలున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం




