Telangana: మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీ రిజర్వాయర్‎కు నీరు విడుదల

మిడ్ మానేరు నుంచి దిగువ మానేరు జ‌లాశ‌యానికి రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నీటిని విడుదల చేశారు. మండుటెండ‌ళ్ళల్లోనూ, వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం జ‌లాలు రాష్ట్రాన్ని ఆదుకున్నాయని తెలిపారు.

Telangana: మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీ రిజర్వాయర్‎కు నీరు విడుదల
Mid Manair Dam
Follow us
G Sampath Kumar

| Edited By: Aravind B

Updated on: Jul 18, 2023 | 2:08 PM

మిడ్ మానేరు నుంచి దిగువ మానేరు జ‌లాశ‌యానికి రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నీటిని విడుదల చేశారు. మండుటెండ‌ళ్ళల్లోనూ, వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం జ‌లాలు రాష్ట్రాన్ని ఆదుకున్నాయని తెలిపారు. మేడిగ‌డ్డ నుంచి ఎత్తిపోత‌ల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి ఉండ‌క‌పోతే.. ఈరోజు తెలంగాణ ప‌రిస్థితి ఎలా ఉండేదో ఊహకు కూడా అందేది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేప‌ట్టిన కాళేశ్వరం ఎత్తి పోత‌ల ప‌థ‌కం ఫ‌లితాలు ఈరోజు ప్రజల కళ్ళ ఎదుట కనబడుతున్నాయని చెప్పారు.

ఈ సంవత్సరం వ‌ర్షం లేక‌పోయినా.. ఇప్పుడు వ‌ర‌ద కాలువ నిండు కుండ‌లా ప్రవహిస్తోందన్నారు. మొత్తం 80 చెరువులను నింపుతున్నామని వ‌ర‌ద‌ కాలువ చుట్టూ భూగ‌ర్భ జ‌లాలు పెరిగి అన్నదాత‌ల‌కు క‌ల్పత‌రువుగా మారిందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో రైతలకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోత‌ల ద్వారా మొద‌ట‌గా ల‌బ్ధి పొందేది ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలేనని వెల్లడించారు.