శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఇప్పటికే కాళేళ్వరం జలాలు మధ్య మానేరు.లోయర్ మానేరు ప్రాజెక్టులకు చేరగా ఇప్పడు శ్రీరాంసాగర్‌కు చేరుకోవడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజేశ్వరావుపేట పంప్‌హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో ఎస్‌ఆర్ఎస్‌పీకి నీరు చేరింది. జలకళతో నిండుగా కనిపిస్తున్న ప్రాజెక్టు వద్దకు రైతులు, ప్రజలు భారీగా చేరుకుని పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ఎస్‌ఆర్ఎస్‌పీ నీరువచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:36 pm, Sat, 7 September 19
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఇప్పటికే కాళేళ్వరం జలాలు మధ్య మానేరు.లోయర్ మానేరు ప్రాజెక్టులకు చేరగా ఇప్పడు శ్రీరాంసాగర్‌కు చేరుకోవడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజేశ్వరావుపేట పంప్‌హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో ఎస్‌ఆర్ఎస్‌పీకి నీరు చేరింది. జలకళతో నిండుగా కనిపిస్తున్న ప్రాజెక్టు వద్దకు రైతులు, ప్రజలు భారీగా చేరుకుని పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ఎస్‌ఆర్ఎస్‌పీ నీరువచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కోసం భగీరధ ప్రయత్నంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అందువల్లే ప్రస్తుతం ఇంత నీటిని చూస్తున్నామని రైతులు ఆనందంతో చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారంతా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ ఈ నీటితో తమ కష్టాలన్నీ తీరిపోతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.