గణేష్ నిమజ్జనానికి భారీగా బందోబస్తు..!
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉత్సవ కమిటీల నిర్వాహకులు నిమజ్జన వేడుకల నిర్వహణపై దృష్టిసారించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్.. పోలీసుల అనుమతులు వంటి చర్యలు చేపట్టారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా జంటనగరాల్లో ప్రధానంగా చెప్పబడే బాలాపూర్… ఖైరతాబాద్ వినాయకులకు వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఉదయం ఉదయం 8 గంటలకు […]
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉత్సవ కమిటీల నిర్వాహకులు నిమజ్జన వేడుకల నిర్వహణపై దృష్టిసారించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్.. పోలీసుల అనుమతులు వంటి చర్యలు చేపట్టారు.
నవరాత్రి వేడుకల్లో భాగంగా జంటనగరాల్లో ప్రధానంగా చెప్పబడే బాలాపూర్… ఖైరతాబాద్ వినాయకులకు వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఉదయం ఉదయం 8 గంటలకు బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర మొదలు కానుంది. శోభాయాత్రకు ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, స్వామి ప్రజ్ఞానంద హాజరుకానున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు చెప్పారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు. హుసేన్‌సాగర్ నీరు పరిశుభ్రంగా ఉండాలని ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించాలని అనుకున్నామని.. అయితే ప్రభుత్వమే ముందుకు రావడం హర్షణీయమన్నారు గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు.
కాగా.. నగరంలో.. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి 21 వేల మంది పోలీసులకు బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో పాటు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. జంట నగరాల్లో దాదాపు 162 కిలో మీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుందని తెలంగాణ పోలీసులు తెలిపారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో.. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు.. అలెర్ట్‌గా ఉండాలని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.