తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్… విప్‌లుగా…!
ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసన సభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా శాసనమండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయభాస్కర్, విప్ లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, […]
ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసన సభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా శాసనమండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయభాస్కర్, విప్ లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావు, బాల్క సుమన్ లను సీఎం కేసీఆర్ నియమించారు. కాగా గత అసెంబ్లీలో చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ వ్యవహరించగా, ప్రస్తుతం ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించిన రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.