AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకం కానున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు. ఇకపోతే సౌందర్ […]

రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ..
Ravi Kiran
|

Updated on: Sep 08, 2019 | 10:14 PM

Share

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకం కానున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు. ఇకపోతే సౌందర్ రాజన్ ఉదయం 11 గంటలకు తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఫిబ్రవరి 19న మరో 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడే రెండోసారి మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారు. అంతేకాకుండా అన్ని రకాల పదవులను భర్తీ చేయాలనీ కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్‌ల నియామకాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి.. రేపు దశమి పూట మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు.

మరోవైపు ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్.. కొత్త గవర్నర్ వస్తున్న రోజే కొత్తగా కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఇక ఈ క్యాబినెట్‌లో ఆరుగురికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

  • ఖమ్మం నుంచి కనుక అజయ్ రేసులో ఉన్నారు.
  • ఇక మహిళా కోటాలో ఇద్దరికీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్ ఖరారు కాగా… ఇంకొకరు సబితా ఇంద్రారెడ్డి అని వినిపిస్తోంది.
  • ఇక కేసీఆర్, హరీష్ రావుల ఇద్దరికీ చోటు దక్కుతుందా.. లేదా ఒక్కరికేనా అనేది ఆసక్తిగా మారింది.
  • సబితా ఇంద్రారెడ్డికి స్థానం ఇస్తే.. మల్లారెడ్డికి ఉద్వాసన తప్పదని సమాచారం
  • ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు దాదాపు స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది.

కాగా ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా మార్చేందుకు కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలనీ సీఎం నిర్ణయించారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ సీనియర్ నేతలు మధుసూదనా చారి, జూపల్లి కృష్ణారావులకు కూడా త్వరలోనే ఉన్నత పదవులను ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తదితరులకు కూడా ఉన్నతమైన పదవులిచ్చి ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకోవాలనిముఖ్యమంత్రి భావిస్తున్నారు. వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది.

ss