పాక్ వక్ర బుద్ధి.. రాష్ట్రపతికి నో ఎంట్రీ!

పాకిస్తాన్ మరోసారి తన దొంగ బుద్దిని బయటపెట్టింది. తాజాగా భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని కోరగా.. పాకిస్థాన్ వెంటనే తిరస్కరించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ మోహమూద్ ఖురేషి అధికారికంగా వెల్లడించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ అహంకారపూరిత చర్యలకు అంతర్జాతీయ సమాజమే విస్తుపోతోంది. ఇకపోతే కొద్దిరోజులుగా భారతదేశం ప్రవర్తించే తీరు నచ్చకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ మంత్రి […]

  • Updated On - 2:01 am, Sun, 8 September 19
పాక్ వక్ర బుద్ధి.. రాష్ట్రపతికి నో ఎంట్రీ!

పాకిస్తాన్ మరోసారి తన దొంగ బుద్దిని బయటపెట్టింది. తాజాగా భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని కోరగా.. పాకిస్థాన్ వెంటనే తిరస్కరించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ మోహమూద్ ఖురేషి అధికారికంగా వెల్లడించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ అహంకారపూరిత చర్యలకు అంతర్జాతీయ సమాజమే విస్తుపోతోంది.

ఇకపోతే కొద్దిరోజులుగా భారతదేశం ప్రవర్తించే తీరు నచ్చకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ మంత్రి ఖురేషి చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా జమ్మూకాశ్మీర్ అంశం.. తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో పాకిస్థాన్ జోక్యం చేసుకోవద్దని భారత్ పలుసార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చర్యపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ‘విద్వేషపూరితమైన ఏకపక్ష నిర్ణయాల గురించి పాక్ మరోసారి ఆలోచిస్తే మంచిదని’ పిలుపునిచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాధ్ గోవింద్ యూరోప్‌లోని ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరనున్నారు. ఈ తూర్పు దేశాలకు వెళ్లేందుకు భారత గగనతలమే దిక్కు. అయితే పాకిస్థాన్ మాత్రం తన కుతంత్ర బుద్దిని ఏదో రకంగా బయటపెడుతూనే ఉంది. కశ్మీర్ అంశం విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పాక్ గగనతలం మీదుగా విదేశీ పర్యటనకు వీలు కల్పించవద్దని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఖురేషి ఓ ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు గత నెలలో జమ్మూకాశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ రద్దు అనంతరం పాకిస్థాన్ తన వక్ర బుద్దిని బయటపెడుతూ వస్తోంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో సహా.. మిగిలిన మంత్రులందరూ కూడా ఏదో రకంగా భారత్‌పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇక తాజాగా చంద్రయాన్ 2 విషయంలో కూడా భారత్‌ను ఉద్దేశించి పలు దిగజారుడు ట్వీట్లను పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చేశారు. ఇక ఆ ట్వీట్లకు రియాక్ట్ అయిన నెటిజన్లు తీవ్రంగా స్పందించి ఆయనపై విమర్శలు చేశారు.