రాంగ్‌రూట్‌లో డీజీపీ వాహనం..తప్పని జరిమానా
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న మాటను మరోమారు నిరూపించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే..అది రాజైన, బంటైన, చివరకు డీజీపీ అయినా సరే జరిమానా తప్పదన్నారు. రాంగ్ రూట్లో తమ బాస్ కారు వెళ్లినప్పటికీ జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, అందరూ సమానులేనని దీంతో మరోమారు నిరూపించారు.ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు […]
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న మాటను మరోమారు నిరూపించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే..అది రాజైన, బంటైన, చివరకు డీజీపీ అయినా సరే జరిమానా తప్పదన్నారు. రాంగ్ రూట్లో తమ బాస్ కారు వెళ్లినప్పటికీ జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, అందరూ సమానులేనని దీంతో మరోమారు నిరూపించారు.ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. ఏకంగా రాష్ట్ర డీజీపీకే నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు. ఆ మధ్య సీఎం కాన్వాయ్‌నే ఆపేసి అంబులెన్స్‌కు దారినిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.