AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా ఉద్యోగస్తురాలిని వేధిస్తున్న ఎస్సై.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఎస్సై మహిళా ఉద్యోగి పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఇంకేముంది కథ అడ్డం తిరిగింది. ఆ ఎస్సై పై పోలీస్‎స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‎స్టేషన్‎లో విధులు నిర్వహిస్తున్న అనీల్ అనే సబ్ ఇన్స్పెక్టర్‎పై సుబెదారి పోలీస్‎స్టేషన్ లో కేసు నమోదైంది.

మహిళా ఉద్యోగస్తురాలిని వేధిస్తున్న ఎస్సై.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు..
Kakatiya University Si
G Peddeesh Kumar
| Edited By: Srikar T|

Updated on: Jan 23, 2024 | 2:11 PM

Share

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఎస్సై మహిళా ఉద్యోగి పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఇంకేముంది కథ అడ్డం తిరిగింది. ఆ ఎస్సై పై పోలీస్‎స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‎స్టేషన్‎లో విధులు నిర్వహిస్తున్న అనీల్ అనే సబ్ ఇన్స్పెక్టర్‎పై సుబెదారి పోలీస్‎స్టేషన్ లో కేసు నమోదైంది. కాకతీయ యూనివర్సిటీ పీఎస్‎లో పనిచేస్తున్న ఎస్సై అనిల్ ఓ మహిళా ఉద్యోగిని పట్ల వేధింపులకు గురిచేశాడని బాధితురాలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల మార్కెట్లో చేపట్టారు. ఈ సమయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. ఇదే చోట పోలీసు బందోబస్తు నిర్వహించిన ఎస్సై అనిల్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమెతో వాట్సప్ ద్వారా సందేశాలు పంపడం ప్రారంభించారు. ఆమె తన కార్యాలయానికి వెళ్లే సమయంలో తరచూ వెంటపడేవాడు. పరిచయాన్ని అతి చనువుగా తీసుకొని ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు భయపడి తన భర్తకు విషయం చెప్పింది. ఆయన ఎస్సైని నిలదీశారు. ఉద్యోగిని భర్తను సైతం బెదిరించినట్లు సమాచారం.

దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో ఎస్సై అనిల్‎పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, వేధింపుల కేసు కూడా నమోదైంది. బాధ్యత కలిగిన ఎస్సై ఇలా ప్రవర్తించడం ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్‎లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసు కోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..