
బీఆర్ఎస్పై కడియం కావ్య తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు దందాలు ఎక్కువ చేస్తుంటారని ఆరోపించారు. పార్టీ మారక ముందే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నట్లుండేదని చెప్పారు. ఇప్పుడు కూడా అధికారులు తమ మాట వినడం లేదని కావ్య తెలిపారు. ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని కడియం శ్రీహరి ఆలోచించారని పేర్కొన్నారు. అందుకే కడియం శ్రీహరి సమక్షంలోనే బీఆర్ఎస్‌పై కావ్య విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో కార్యకర్తలతో కడియం శ్రీహరి భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానంపై సమాలోచనలు జరిపారు. సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న కడియం శ్రీహరి తెలిపారు.
గత కొంతకాలంగా పార్టీలో నాయకుల మధ్య వచ్చిన విభేదాల కారణంగానే తాము పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే తనను గెలిపించే వాతావరణం ఇక్కడ లేదని అయినా పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసేందకు సిద్దపడినట్లు పేర్కొన్నారు. తమకు ఎవరూ మద్దతు ఇచ్చే పరిస్థితులు లేని కారణంగానే పోటీ నుంచి తప్పుకున్నట్లు వివరించారు. ఈ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపమే బీఆర్ఎస్ ప్రతిష్ఠను దిగజారుస్తోందని తెలిపారు. తమ నియోజకవర్గాన్నికి ఈ మధ్య కాలంలోనే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చినటప్పుడు కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…