Telangana: ఫ్యామిలీ పాలిట్రిక్స్.. వారసుల కోసం రాజకీయ భవిష్యత్తు ఫణంగా పెడుతున్న నేతలు..

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. అది కూడా ఫ్యామిలీ ప్యాకేజీలతో పార్టీలు మారుతున్న నయా ట్రెండ్. దేశంలో రాజకీయాల్లో వారసత్వం కామన్‌గా మారింది. కానీ తెలంగాణలో మాత్రం ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నారు. కూతురు కోసం, కొడుకు కోసం, భార్య కోసం.. ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పణంగా పెడుతున్నారు.

Telangana: ఫ్యామిలీ పాలిట్రిక్స్.. వారసుల కోసం రాజకీయ భవిష్యత్తు ఫణంగా పెడుతున్న నేతలు..
Telangana Family Politics
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 30, 2024 | 3:35 PM

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. అది కూడా ఫ్యామిలీ ప్యాకేజీలతో పార్టీలు మారుతున్న నయా ట్రెండ్. దేశంలో రాజకీయాల్లో వారసత్వం కామన్‌గా మారింది. కానీ తెలంగాణలో మాత్రం ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నారు. కూతురు కోసం, కొడుకు కోసం, భార్య కోసం.. ఇలా కుటుంబ సభ్యుల రాజకీయ అరంగేట్రం కోసం, పదవుల కోసం సుదీర్ఘ రాజకీయాన్ని ఇతర పార్టీల చేతిలో పెడుతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈ ఫ్యామిలీ ప్యాకేజీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గత నెల రోజులుగా నాలుగు కుటుంబాలు పార్టీలు మారాయి. ఆ నాలుగు రాజకీయ నేపథ్యంలో కుటుంబాలు కూడా రాజకీయ వారసత్వం కోసం కుటుంబ సభ్యులకు పార్టీలు మారిన పరిస్థితి. మొదటగా పట్టం మహేందర్ రెడ్డి ఈయన భార్యకు ఎంపీ టికెట్ కోసం BRS ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. తమ్ముడు పార్టీ మారకపోయినా భార్య కోసం ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్న కండువా కప్పుకోకుండా… భార్య సునీత మహేందర్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించారు. ఇప్పటికే వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ కట్టబెట్టింది. కేవలం భార్య ఎంపీ టికెట్ కోసమే ఆయన రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన BRS ను వీడారు.

ఇక తాజాగా పార్టీ మారిన మరో సీనియర్ నేత కే కేశవరావు. 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేశవరావు. రాజకీయ ప్రస్థానం మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్యమ సమయంలో ఆయన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. గత పదేళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ కేసిఆర్ సన్నిహితులుగా రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కేకేకు రాజ్యసభ, ఆయన కొడుకుకు కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూతురుకి హైదరాబాద్ మేయర్‌గా అవకాశం కల్పించారు. మొత్తంగా కేసీఆర్ తర్వాత కుటుంబ మొత్తానికి పదవులు సంపాదించిన వ్యక్తి కేకే మాత్రమే..! ఇప్పుడు కూడా తిరిగి మళ్లీ కుటుంబ పదవుల కోసమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ మహానగర మేయర్‌గా ఉన్నారు కూతురు విజయలక్ష్మి. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఆస్థానం ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌లో చేరితే ఖైరతాబాద్ నుంచి విజయలక్ష్మి పోటీలోకి దింపే అవకాశం ఉంటుందని కేకే భావించారట అందు కోసమే పార్టీ మారినట్లు తెలుస్తుంది. అయితే ఆయనతోపాటు మేయర్‌గా ఉన్న ఆయన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కొడుకు విప్లవ మాత్రం BRS పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలోనే పార్టీ మారిన మరో సీనియర్ లీడర్ కడియం శ్రీహరి. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో ఉపముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కడియం. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై తీవ్ర విమర్శలు చేసిన కడియం తీరా చూసేసరికి ఆ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన కూతురికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నుంచి ఎంపీగా టికెట్ కేటాయించింది. అయినా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు సులభం అనుకున్న కడియం, వెంటనే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం కూతురు కావ్య రాజకీయ ఆరంగ్రేటం కోసమే ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో.. ఎప్పుడు లేనని విమర్శలు ఎదుర్కొంటూ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

ఇక నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కూడా కొడుకు భరత్ కోసం భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. కావాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే టికెట్ ఇస్తానన్న, తిరస్కరించి మరి ఆయన పార్టీ మారారు. అటు బీజేపీ కూడా ఆయనకు నాగర్ కర్నూల్ సీటును కేటాయించింది. భరత్ పొలిటికల్ ఫ్యూచర్ కోసమే ఆయన పార్టీ మారారు అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం..!

ఇక ఇదే బాటలో మరి కొంతమంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ వారసత్వం కోసం తనయులకు పదవుల కోసం ఏ పార్టీలోకి వెళ్లడానికైనా, ఎలాంటి విమర్శలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతున్నారు ప్రస్తుత సీనియర్ పొలిటికల్ లీడర్స్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
సౌదీ అరేబియాలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి.. ఒకరు మృతి..
సౌదీ అరేబియాలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి.. ఒకరు మృతి..
ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెలెక్టర్లకు షాక్..
ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెలెక్టర్లకు షాక్..
ఒక్క సెంచరీతో సచిన్ రికార్డును తిరగరాశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరో?
ఒక్క సెంచరీతో సచిన్ రికార్డును తిరగరాశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరో?
రెండస్థుల భవనంపై పిడుగు పాటు పెళ్ళికి వచ్చిన అతిధుల ముగ్గురు మృతి
రెండస్థుల భవనంపై పిడుగు పాటు పెళ్ళికి వచ్చిన అతిధుల ముగ్గురు మృతి
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
వామ్మో.. లచ్చిందేవి.. వ్యాన్, లారీ ఢీ.. అట్టపెట్టెల నిండా
వామ్మో.. లచ్చిందేవి.. వ్యాన్, లారీ ఢీ.. అట్టపెట్టెల నిండా
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి..
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి..
రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైకే షాక్
రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైకే షాక్
ఎన్నికల వేళ సొంతూర్లకు తరలివెళ్తున్న ప్రజలు.. కిక్కిరిసిన రైళ్లు
ఎన్నికల వేళ సొంతూర్లకు తరలివెళ్తున్న ప్రజలు.. కిక్కిరిసిన రైళ్లు
ఎవర్రా మీరంతా.. ఒకే బంతికి 2 రనౌట్ ఛాన్స్‌లు.. నవ్వులే నవ్వులు
ఎవర్రా మీరంతా.. ఒకే బంతికి 2 రనౌట్ ఛాన్స్‌లు.. నవ్వులే నవ్వులు
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!