AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: జొన్న పంట భలే ఏపుగా పెరిగిందే అనుకునేరు.. లోపలికి వెళ్లి చూసి పోలీసులు స్టన్

పంట చేలలో రైతులు అంతర పంటలు పండిస్తారు. అదనపు ఆదాయం కోసం ఇలా అంతర పంటలు సాగు చేయటం కామన్. అయితే ఈ రైతుకు అధిక ఆదాయం కోసం.. ఏకంగా ఇల్లీగల్ పని చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాలు తెలుసుకుందాం...

Medak: జొన్న పంట భలే ఏపుగా పెరిగిందే అనుకునేరు.. లోపలికి వెళ్లి చూసి పోలీసులు స్టన్
Jawar Crop (Representative image)
Ram Naramaneni
|

Updated on: Mar 30, 2024 | 2:12 PM

Share

రైతులు.. కష్టపడి పని చేస్తారు. ప్రపంచానికి అన్నం పెడతారు. ఆరుగాలం కష్టపడి.. వ్యయప్రయాసలకు ఓర్చి.. పంట దిగుబడి చేస్తారు. అంత కష్టపడి పండించిన పంటకు సరైన గిరాకీ లేకపోవడంతో.. కొందరు రైతులు దార్లు తప్పుతున్నారు. మాములు పంట చేలల్లో అంతర పంటలు పండించడం కామన్. కూరయలు లేక మినుములు, పెసలు, కందులు వంటి చిరు ధాన్యాలను పెంచుతూ ఉంటారు. కాస్త ఆదాయం వచ్చే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తారు. అయితే ఈ రైతు మాత్రం తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. జొన్న చేలో అంతరపంటగా గంజాయి సాగు చేశాడు. సమాచారం అందడంతో.. ఎక్సైజ్ అధికారులు గుట్టు రట్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మెదక్ జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లికి చెందిన కంకోల్‌ రమేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న పొలంలో జొన్న సాగు చేశాడు. అయితే అందులో అంతర పంటగా ఎవరికీ అనుమానం రాకుండా  గంజాయి కూడా పెంచాడు. జొన్న ఎత్తు పెరుగుతుంది కాబట్టి.. కనపడదని ఇలా చేశాడు. అయితే గంజాయి ఎదిగాక వాసన ఆగుతుందా చెప్పండి. దీంతో విషయం  ఎక్సైజ్ అధికారులకు తెలియడంతో.. పరిశీలనకు వెళ్లారు. జొన్న చేలో మొత్తం 140 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించి.. వాటిని పీకివేశారు. వీటి విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

రైతు రమేశ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇలా అధిక ఆదాయం కోసం.. జొన్న పొలంలో అంతర పంటగా గంజాయి సాగు చేయటం గురించి తెలిసి అందరూ స్టన్ అయ్యారు. అవి గంజాయి మొక్కలనే విషయం తాము కనిపెట్టలేకపోయామని చుట్టుపక్కల రైతులు అంటున్నారు.

Follow Us