Drugs Case: కేపీ చౌదరి అరెస్ట్‌తో సెలబ్రిటీల్లో గుబులు.. సినీ డ్రగ్స్ తీగలాగుతున్న పోలీసులు
మహానగరంలో గమ్మత్తు చిత్రమ్ మరోసారి వెలుగులోకి వస్తోంది. దేశంలో ఏ మూలన మత్తుమందులు పట్టబుడిన డొంక కదిలేది గోవాలోనే. ఒన్స్ గోవాకు వెళ్తే... సామిరంగా సరుకు రస భరిత సిత్రాల్ మాములుగా ఉండవిలా అన్నట్లుగా ఉంది. గోవా టు హైదరాబాద్ డ్రగ్ దందా ఏ రేంజ్‌లో జరుగుతుందో.. గోవాలో ఎక్కెడక్కడ సరుకు విక్రయిస్తుంటారో.. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల నుంచి యువత.. సెలబ్రిటీస్ గోవాలో ఎందుకు వాలుతుంటారో తాజా కేసులో లింకులు లీక్ అవుతున్నాయి.

హైదారబాద్, జూన్ 15: తెలుగు చిత్ర పరిశ్రమలో తీగలాగితే డ్రగ్స్ డొంక కదులుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి తెలుగు హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాత కెపి చౌదరిని డ్రగ్ ట్రాఫికింగ్ విచారణలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరిని సైబరాబాద్ పోలీసులు జైలుకు తరలించారు. అతని వద్ద కొకైన్ కూడా దొరికింది. కేపీ చౌదరి గత కొన్ని నెలలుగా గోవాలో నివాసం ఉంటున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారంతో అతడి ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ బంధంపై ఆరా తీస్తున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి ఇంకా కొన్ని తెలియాల్సి ఉంది.
డ్రగ్ రాకెట్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ,పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇక డ్రగ్ మాఫియా ఖేల్ కతమనుకుంటే గోవా- టు హైదరాబాద్.. హైదరాబాద్ టు గోవా.. డ్రగ్ రాకెట్ మళ్లీ గుప్పుమంది. కబాలి నిర్మాత కెపి చౌదరిని డ్రగ్ అరెస్ట్‌తో తెర మీదకు సినీ డ్రగ్స్ లింక్స్. కేపి చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది. కేపీ చౌదరి నుంచి మొత్తం 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ 4 ఫోన్ల నుంచి కాల్ డేటాను సేకరిస్తున్నారు. కే పి చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరయ్యిన సెలెబ్రిటీల లిస్ట్ తయారు చేస్తున్నారు పోలీసులు.
రాకేష్ రోషన్ అరెస్ట్‌తో టాలీవుడ్ లింకులు వెలుగు చూస్తున్నాయి. రాకేష్ రోషన్ వాట్సప్‌లో కేపీ చౌదరి పేరును గుర్తించారు పోలీసులు. కేపీ చౌదరి వాట్సప్, కాల్ డేటాను తీస్తున్నా సైబరాబాద్ పోలీసులు.కేపి చౌదరి 4 మొబైల్స్ తో పాటు గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 5 మొబైల్స్ ను విశ్లేషిస్తున్నారు. మొత్తం 9 సెల్ ఫోన్ ల డేటా ద్వారా డ్రగ్స్ ముఠాతో సెలబ్రిటీల లింకులను బయటికి తీయనున్నారు. డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం కొనసాగుతోంది పోలీసుల వేట. గోవాలో గాబ్రియేల్ నుంచి డ్రగ్స్ తీసుకున్న 9 మంది నగర వాసులను గుర్తించే పనిలో ఉన్నారు.
నైజీరియాకు చెందిన పెటిట్ ఎబుజర్ నుంచి గంజాయిని కొనుగోలు చేశాడు. దానిని తన స్వంత అవసరాలకు, అతని స్నేహితులకు సరఫరా చేయడానికి ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. చౌదరీకి డ్రగ్ లార్డ్ ఎడ్విన్ నూన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా సమాచారం.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ స్టార్‌ని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు . గతంలో పూరి జగన్నాథ్, ఛార్మీ, రానా దగ్గుబాటి, రవితేజ , ముమైత్ ఖాన్, నవదీప్, నందు, తరుణ్, తనీష్ వంటి వారిని డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు ప్రశ్నించడం మనం చూశాం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం