Jubilee Hills Rape Case: జూబ్లీ హిల్స్ బాలిక రేప్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఐదుగురు మైనర్ల కస్టడీని నిన్నటితో ముగించిన పోలీసులు.. వాళ్ల నుంచి కీలక విషయాల్ని రాబట్టారు. చార్జ్‌షీట్‌కి సరిపడా స్టఫ్ దొరికిందని, మళ్లీ కస్టడీని కోరబోమని చెబుతున్నారు పోలీసులు. మైనర్లను జువైనల్ హోమ్‌కి తరలించారు. మొత్తం ఐదురోజుల కస్టడీపై నివేదికను ఇవాళ జువైనల్ కమిటీకి అందజేస్తారు.
అయితే, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రభావంతోనే తామిలా చేశామంటున్నారు మైనర్లు. సెలవుల్లో వెబ్‌సిరీస్‌లు చూసి క్రైమ్ నేచర్‌కి అలవాటుపడ్డామని చెబుతున్నప్పుడు వాళ్ల దగ్గర పశ్చాత్తాపమే కనిపించలేదంటున్నారు. పైగా.. విచారణ సందర్భంగా ఒకరి మీదొకరు గొడవకు దిగినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏ1 నిందితుడు సాదుద్దీన్ కస్టడీని ముగించి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు సాక్ష్యాధారాలపై కూడా ఫోకస్ చేశారు పోలీసులు. మొత్తం 17 మంది సాక్షుల్లో ఏడుగురిని విచారించారు. బెంజ్ కారును మైనర్లే నడిపినట్లు నిర్ధారణ చేసుకుని, కారు యజమానిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఘటనలో కీలకంగా మారిన ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్‌దేనని తేల్చారు.
బాధితులకు బెదిరింపులు..
బాలిక తల్లిదండ్రులకు బెదిరింపులొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అఘాయిత్యం జరిగిందని తెలియగానే.. నిందితుల పేరెంట్స్‌కు ఫోన్ చేయగా, కేసు పెడితే చంపేస్తామని బెదిరించారని, బాధితురాలిని తీసుకెళ్లిన హాదీ పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం డీటెయిల్స్‌తో త్వరలో చార్జ్‌షీట్ ఫైల్ చెయ్యబోతున్నారు జూబ్లి హిల్స్ పోలీసులు.