AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అన్నం పెట్టిన చెయ్యిని నరుక్కుంటామా’ ? రవి కిషన్ పై జయా బచ్చన్ ఫైర్

బాలీవుడ్ లో డ్రగ్స్ మహమ్మారి వీర విహారం చేస్తోందని, ఈ అడిక్షన్ కి హిందీ చిత్ర పరిశ్రమ కూడా గురి కావడం విచారకరమని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు కూడా అయిన రవి కిషన్ నిన్న లోక్ సభలో..

'అన్నం పెట్టిన చెయ్యిని నరుక్కుంటామా' ? రవి కిషన్ పై జయా బచ్చన్ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 11:07 AM

Share

బాలీవుడ్ లో డ్రగ్స్ మహమ్మారి వీర విహారం చేస్తోందని, ఈ అడిక్షన్ కి హిందీ చిత్ర పరిశ్రమ కూడా గురి కావడం విచారకరమని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు కూడా అయిన రవి కిషన్ నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఖండించారు. (సుశాంత్ హత్యకేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ కి డ్రగ్స్ లింక్ పై దర్యాప్తు చేయడం హర్షణీయమని, చాలామంది డ్రగ్స్ కి అలవాటు పడ్డారని రవి కిషన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్, చైనా దేశాల కుట్ర ఫలితంగా ఈ దేశం లోని యువత మత్తుమందులకు బానిసలవుతున్నారని కూడా ఆయన అన్నారు.) అయితే దీన్ని ఖండించిన జయబచ్చన్ ..ఎవరో కొంతమందికి డ్రగ్స్ తో లింక్ ఉండవచ్ఛునని, అంతమాత్రాన అందరికీ ఈ అలవాటు ఉందనడం సరికాదని అన్నారు. మీరు కూడా చిత్ర సీమతో సంబంధం ఉన్నవారేనని పేర్కొన్న ఆమె..ఆహారం పెట్టిన చెయ్యిని నరుక్కుంటామా అని ప్రశ్నించారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారని, అందువల్ల ప్రభుత్వం ఈ ఇండస్ట్రీకి అండగా నిలవాలని ఆమె కోరారు.

;

Follow Us