Muthireddy Yadagiri Reddy’s daughter: జనగామ MLA ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరో టర్న్ తీసుకుంది. ఆదివారం ఉదయాన్నే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటికి అప్పగిస్తానన్నారు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి, తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని బోర్డు కూడా ఏర్పాటు చేశారు భవానీ. త్వరలోనే ఆ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ ఏ గొడవలు రాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని చెప్పారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్నకు 70 ఏళ్ళు వచ్చాయి.. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉంది.. అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేయకూడదంటూ పేర్కొన్నారు. చెరువు మత్తడి భూమిని నాపేరు మీద పట్టా చేయించారు. తప్పు జరిగింది..క్షమించండి .. అంటూ కోరారు. తన పేరు మీద ఉన్న భూమిని మళ్ళీ చేర్యాల మున్సిపాలిటికి రాసిస్తున్నాను.. మళ్ళీ ఎటువంటి గొడవలు కాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానంటూ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..