Telangana: గాడిదతో ర్యాలీ.. శీర్షాసనం వేసి నిరసన.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ఊరికి బ్రిడ్జి కోసం ఓ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన ఆ జిల్లాలో చర్చకు దారితీసింది. బ్రిడ్జి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకొని విసిగిపోయిన ఆ గ్రామస్తులు ఈసారి పాలకులు, అధికారులు అంతా ఆలకించేలా వెరైటీ నిరసన చేపట్టారు.. గాడిదతో కలెక్టరేట్ ముట్టడి చేపట్టి, కలెక్టరేట్ ముందు తలకిందులుగా శీర్షాసనం వేసి అంతా ఆలకించేలా చేశారు.

ఊరికి బ్రిడ్జి కోసం ఓ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన ఆ జిల్లాలో చర్చకు దారితీసింది. ఈ వినూత్న నిరసన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది.. గానుగుపహాడ్- చిటకోడూరు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు.. వర్షాకాలం వచ్చిందంటే ఈ గ్రామాల ప్రజలకు నిత్య నరకమే.. ఈ బ్రిడ్జి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు.. అయినా వాళ్లు పట్టించుకోకపోవడంతో విసిగిపోయారు.. తాజాగా సంభవించిన వరదలు, వర్షాల నేపథ్యంలో ఈ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఇక సమస్య పరిష్కార సాధన కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.. కాజ్ వే ఉన్నచోట బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఈ క్రమంలోనే బ్రిడ్జి నిర్మాణ సాధన సమితి ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టి జనగామ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి శ్రీకారం చుట్టారు.. జనగామ లోని అంబేద్కర్ సర్కిల్ నుండి గాడిదతో ర్యాలీ చేపట్టిన గ్రామస్తులు కలెక్టరేట్ వరకు గాడిదతో నిరసన చేపట్టారు.. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
వీళ్ళ ఆందోళన అందరూ ఆలకించేలా ఓ వ్యక్తి తలకిందులుగా శీర్షాసనం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
