MLA Phone Hacked: ఏకంగా ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ హ్యాక్.. వాట్సప్ గ్రూపుల్లో ఏ పోస్టులు చేశారో తెలుసా..
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అనేక మార్గాల్లో వివిధ వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఖాతాల్లోని నగదును అమాంతం దోచేస్తున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను సైతం మోసం చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఓటీపీలు, డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోయిన ఈ సైబర్ నేరగాళ్లు తాజాగా అధికారులు, రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు హ్యాక్ చేస్తూ కొత్త తరహా మోసాలకు తెర లేపుతున్నారు.

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా మొబైల్ నెంబర్స్ హ్యాక్ చేస్తూ.. కోట్లు కొళ్లగొడుతున్నారు. ఈ మోసాల జాబితాలో కీలకమైన వ్యక్తుల ఫోన్ నంబర్లను హ్యాక్ చేయడం.. అదే నెంబర్ తో వివిధ వాట్సప్ గ్రూప్ ల్లో ఏపీకే ఫైల్ పోస్టులు చేయడం చేస్తు్న్నారు. ఆ ఏపీకే ఫైల్ ఓపెన్ చేయగానే సదరు వ్యక్తి మొబైల్ హ్యాక్ అవుతుంది. మన మెబైల్ యాక్సెస్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అనంతరం వారి ఖాతాల్లోని నగదు కాజేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తి నెంబర్ తో మరిన్ని వాట్సప్ గ్రూప్ ల్లో ఇదే మాదిరి ఏపీకే ఫైల్స్ పోస్టులు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ తరహా హ్యాకింగ్ కు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు బాధితుడయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే నెంబర్ తో వివిధ వాట్సప్ గ్రూప్ లలో ఆర్టీఏ చాలన్ పేరుతో ఏపీకే ఫైల్ పోస్టులు దర్శనిమిచ్చాయి. కాసేపటికి ఆ విషయాన్ని సదరు గ్రూప్ సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది అన్ని వాట్సప్ గ్రూపుల్లో ఎమ్మెల్యే విజయుడు నంబర్ హ్యాక్ అయ్యిందని.. ఎవరూ ఏమి డౌన్ లోడ్ చేయవద్దని, ఏ ఫైల్ ఓపెన్ చేయకూడదని మెసేజ్ లు పోస్టు చేశారు.
ఎన్నడూ లేనిది ఎమ్మెల్యే నంబర్‌తో వాట్సప్ గ్రూప్ లలో పోస్టులు చూసి చాలా మంది షాక్ అయ్యారు. తీరా వివరాల్లోకి వెళితే ఆయన ఫోన్ నెంబర్ హ్యాక్ కావడంతో ఒక్కసారిగా అవాక్క్ అయ్యారు. అయినా ఎమ్మెల్యే ఫోన్ నంబర్ హ్యాక్ కావడం ఏంటని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన తర్వాత జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే జనాలను సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
