Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. అలాగే.. విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలోని ఉపరితల చక్రవాత ఆవర్తనం బలహీనపడింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. అలాగే.. విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలోని ఉపరితల చక్రవాత ఆవర్తనం బలహీనపడింది. వీటి ప్రభావంతో రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో వాతారణ సూచనలు ఇలా ఉన్నాయి..
మంగళవారం (04-11-2025) .. ఏపీలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.
తెలంగాణలో వాతావరణ సూచనలు..
తెలంగాణలో కూడా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావారణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా.. పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయఇ.. అలాగే రాష్ట్రంలోని కొన్ని పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
