AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగిన రైతు..

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మార్పు బెన్ను అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దళితులకు కేటాయించిన 56 ఎకరాల భూమిలో మరొకరి పేరు మీద ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో బెన్ను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగింది? ఉన్నతాధికారులు ఏం అన్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగిన రైతు..
Bapatla Collectorate Incident
T Nagaraju
| Edited By: Krishna S|

Updated on: Nov 03, 2025 | 6:59 PM

Share

బాపట్ల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుంది. గ్రీవెన్స్ వచ్చిన వారితో హాడావుడిగా ఉంది. అయితే కలెక్టరేట్ వరండాలోకి వచ్చిన మార్పు బెన్ను అనే వ్యక్తి ఒక్కసారిగా పురుగు మందు డబ్బా మూత తీసి తాగడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఇది గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అసలేం జరింగిందంటే..?

బాపట్ల జిల్లా చిన గంజాం మండలం మున్నంవారి పాలెంకు చెందిన 22 మంది దళితులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం 56 ఎకరాల భూమిని కేటాయించింది. వీరంతా ఆ భూమిని కొద్దీ కాలం పాటు సాగు చేసుకున్నారు. అనంతరం ఆ భూమిని గ్రామానికే చెందిన మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చారు. లీజుకి ఇచ్చి కూడా ఏడేళ్లు గడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో బెన్ను భూమిలో ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బెన్ను అధికారులను కలిసి సునీల్ చౌదరి భార్య పేరు మీద ఏవిధంగా ట్రాన్స్ ఫార్మర్లను మంజూరు చేశారని ప్రశ్నించాడు. అదే విధంగా పోలీసులకు కలిసి తమ భూమిలో ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసిన సంగతి చెప్పాడు. అయితే ఈ విషయంలో అధికారులు, పోలీసులు తాము చేసేదేమి లేదని చెప్పారు. దీంతో బాధితుడు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు వచ్చాడు.

కలెక్టరేట్‌లోకి వస్తూనే పురుగుమందు డబ్బా తీసుకొని వచ్చాడు. కార్యాలయంలోకి వచ్చిన కొద్ది సేపటికే పురుగు మందు సేవించాడు. సకాలంలో చుట్టు పక్కల ఉన్నవారు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. బెన్ను సమస్యను ఉన్నతాధికారులు ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే