Pawan Kalyan: ‘తెలంగాణ అసెంబ్లీలో వారుండాలి, అదే నా కోరిక’.. తెలంగాణలో పోటీపై పవన్ క్లారిటీ..

తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతోంది? పోటీ చేయడం మాత్రం పక్కా అనే క్లారిటీ ఇచ్చేశారు పవన్.! ఎన్ని స్థానాల్లో బరిలో నిలుస్తారు? ఏ పార్టీతో కలిసి నడుస్తారు?

Pawan Kalyan: ‘తెలంగాణ అసెంబ్లీలో వారుండాలి, అదే నా కోరిక’.. తెలంగాణలో పోటీపై పవన్ క్లారిటీ..
Janasena President Pawan

Updated on: Jan 24, 2023 | 9:35 PM

తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతోంది? పోటీ చేయడం మాత్రం పక్కా అనే క్లారిటీ ఇచ్చేశారు పవన్.! ఎన్ని స్థానాల్లో బరిలో నిలుస్తారు? ఏ పార్టీతో కలిసి నడుస్తారు? పొలిటికల్‌ పవర్‌లోనూ భాగం కావాలన్న పవన్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం.

ఏపీ రాజకీయాలపైనే ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలో పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన.. 7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో పొత్తులకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. 25 నుంచి 40 అసెంబ్లీ సీట్లలోనూ బరిలోకి దిగిందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఒకటికిరెండుసార్లు పర్యటిస్తానని చెప్పారు పవన్.

ఇవి కూడా చదవండి

కొన్ని కారణాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని, కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదని చెప్పారు పవన్. తన రాజకీయ ప్రస్థానంతోపాటే.. జనసేన పుట్టుక కూడా తెలంగాణ గడ్డపై నుంచే మొదలైందన్నారు. పరిమితస్థాయిలోనే పోటీ చేస్తూ ఆట మొదలుపెడుతామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలన్నది తన కోరికని చెప్పారు పవన్.

ఉదయం వారాహి వెహికిల్‌కు కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండగట్టు నుంచి ధర్మపురి వెళ్లిన పవన్.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని.. అనుష్టుప్‌ యాత్రకు శ్రీకారం చుట్టారు. మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..