Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు.. ఎన్నికల బరిలోకి పవన్ ప్రచార రథం

|

Jan 24, 2023 | 2:06 PM

ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం అయింది. కొండగట్టు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు.. ఎన్నికల బరిలోకి పవన్ ప్రచార రథం
Pawan Puja At Kondagattu
Follow us on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జనసేనాని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు.
పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించిన వేద పండితులు వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు. వారాహి వాహనానికి పండితులు ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేనాని ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు.

వారాహి వాహనానికి పూజల చేయడానికి నిమిత్తం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కళ్యాణ్ ఉదయమే హైదరాబాద్ నుంచి బయలు దేరారు. జనసేనానితో పాటు నేతలు, కార్యకర్తలు భారీగా కాన్వాయ్ తో కలిసి వెళ్లారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ ఆలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుకోవడంతో అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా కొండగట్టుకు చేరుకున్నారు జనసేనాని. ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం అయింది.

హైదరాబాద్ నుంచి కొండగట్టు చేరుకునే మార్గ మధ్యలో పవన్ కు అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ కు గజమాలలతో సత్కారం చేసహ్రు. పూలు జల్లి  ఆనందోత్సాహాలను తెలిపారు.

ఇవి కూడా చదవండి

జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తమ అధినేత పర్యటనలో పాల్గొనేందనుకు ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..