AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS-BJP: బీజేపీ గూటికి బీఆర్ఎస్ నాయకురాలు.. కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి

జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ శ్రావణి కమలం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే సంజయ్‌తో ఉన్న విభేదాలతో బీఆర్ఎస్‌ వీడారు శ్రావణి.

BRS-BJP: బీజేపీ గూటికి బీఆర్ఎస్ నాయకురాలు.. కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి
Jagtial Ex Municipal Chairperson Shravani
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2023 | 6:39 PM

Share

జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో తనను అణచివేశారని.. తన ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. మరోవైపు శ్రావణి చేరికతో జగిత్యాల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందని అభిప్రాయపడుతున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..