‘బీజేపీ ఎమ్మెల్యేలు 5మంది కాంగ్రెస్‎లోకి వస్తారు’.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమీష్టి కృషితో తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‎లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు.

'బీజేపీ ఎమ్మెల్యేలు 5మంది కాంగ్రెస్‎లోకి వస్తారు'.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Jagga Reddy
Follow us

|

Updated on: May 14, 2024 | 3:46 PM

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమీష్టి కృషితో తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‎లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం వ్యవహారించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల్లో అధికారన్ని వాడుకొని ఇతర పార్టీలను ఇబ్బందికి గురిచేశాయన్నారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై పండితుడు లాగా జాతకాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అయన కామెంట్స్ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‎కు ఈ ఎన్నికల్లో కూడా క్లియర్ మెజారిటీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను కూడా పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు. తమ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి ముందు అని బీజేపీని విమర్శించారు.

భారతదేశంలో యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. రూ.15 లక్షలు పేద వాడి అకౌంట్‎లో వేస్తా అన్నారు ఏమైందని నిలదీశారు. చెప్పింది చేయకుండా తప్పించుకునే దాంట్లో మీకు సాటి ఎవరూ రారన్నారు. ఏమైనా మాట్లాడితే దేవుడు పేరు చెబుతారని ఫైర్ అయ్యారు. మోసం అంటే తెలియని కుటుంబం గాంధీ కుటుంబం అని హామీలపై డిబేట్ కి వస్తారా అని సవాల్ విసిరారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలాంటి డోకా లేకుండా నడుస్తుందన్నారు. కాంగ్రెస్‎లో బీఆర్ఎస్ విలీనం అంటున్నారు.. కేసీఆర్‎కి అంత అవసరం ఏమొచ్చిందని అడిగారు. లక్ష్మణ్ మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు ఉన్నాయని చురకలు అంటించారు. బీజేపీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి 5 మంది వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుండి 20మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని చెప్పారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో