
మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూ కొనుగోళ్లు – అమ్మకాలు, మేనేజ్‌మెంట్ కోటా కింద మెడికల్ సీట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల్లో మొత్తం రూ. 8కోట్లు 80 స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే ఐటీ సోదాల్లో రూ. 4కోట్లు 80 లక్షలు స్వాధీనం చేసుకోగా.. ఇప్పటి వరకు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు 80 లక్షలు, మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 2 కోట్లు లభించాయి. మంత్రి మల్లారెడ్డి భార్య తమ్ముడి కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ. 4కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్‌ను అధికారులు ఓపెన్ చేయించారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై ఐటీ అధికారులు మెరుపుదాడులు జరుగుతున్నాయి.
మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులు మరో రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం