Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?
కరీంనగర్‌లోని ఓ జూనియర్ కాలేజ్ ఇంటర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థిని ఎగ్జామ్ రాస్తుండగా.. గదిలో తిరుగుతున్న ఫ్యాన్ తనపై పడింది. విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పరీక్ష కేంద్రంలోని అధికారులు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించి పరీక్ష రాయించారు.

అసలే పబ్లిక్ ఎగ్జామ్.. ఏడాదంతా చదివింది గుర్తుపెట్టుకుని రాయాలి. ఎంతో హైరానాలో ఉంది ఆ విద్యార్థిని. ఆ టెన్షన్‌తో హడావిగా పరీక్ష హాల్‌లోకి వెళ్లింది. ఇన్విజిలేటర్ అందరితో పాటు ప్రశ్నాపత్రం, జవాబు పత్రం అందజేయడంతో.. ఆన్సర్స్ రాయడం మొదలెట్టింది. అయితే అంతలోనే కుదుపు… ఏం జరిగిందో తెలుసుకునేలోపే.. ముఖంపై నుంచి రక్తం కారుతుంది. ప్యాన్ రెక్క ఊడి పడటంతో ఆ విద్యార్థిని గాయపడింది. ముఖంపై ఓ మాదిరి గాయాలవ్వడంతో.. ప్రథమ చికిత్స తీసుకుని పరీక్ష పూర్తి చేసింది. అయితే పరీక్ష కేంద్రాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడడంతో నీలి సాన్వి అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తలపై పడింది. దీంతో విద్యార్థినికి గాయాలయ్యాయి.వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ముక్కుకు గాయం అవ్వడంతో.. బ్యాండెజ్ వేశారు. ముక్కుకు రెండు వైయిపుల స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే.. చికిత్స కోసం కాస్త బ్రేక్ తీసుకోవడంతో… ఈ అమ్మాయికి అదనంగా మరో అర్ధగంట సమయం పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. పరీక్ష ముగిశాక… కేంద్రం నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకొర వసతులతో కూడిన సెంటర్స్ లలో పరిక్ష కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలాం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..