Telangana: ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను నిర్మించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి వ్యక్తికి సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతి సవంత్సరం 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందన్నారు. అలాగే ఇళ్లు మొదటు పెట్టిన ప్రతి ఒక్కరికి బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు సైతం రాష్ట్రంలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లును మంజూరు చేయాలని తన దృష్టికి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. దాంతో పాటు ఇంతకు ముందు గృహ జ్యోతి కింద మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణ్నాన్ని కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. వాటిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందని ఆలోచించిన గత ప్రభుత్వం.. పేదవాడి సొంతింటి కళను మాత్రం పట్టించుకోలేని విమర్శించారు. గృహ నిర్మాణ శాఖను సైతం నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
