AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మీ సేవలో దరఖాస్తు చేసుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆగస్ట్ 10లోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలకు సంబంధించిన వివరాలు చూస్తే..

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..
Indiramma Housing
Venkatrao Lella
|

Updated on: Jul 21, 2026 | 9:35 AM

Share

గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

-తమ నియోజకవర్గం పరిధిలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

-వాట్సప్‌ నెంబర్ 80969 58096 ద్వారా అప్లై చేసుకోవచ్చు

-ఇక మీ సేవ వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు..?

అర్హులైనవారు ఆగస్ట్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి అప్లై చేసుకోవాలి. దీంతో అధికారులు మీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు.

దరఖాస్తు ఫీజు ఎంతంటే..?

దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఇది వెనక్కి ఇవ్వరు. ఇక టోకెన్ అడ్వాన్స్ కింద రూ.10 వేలు చెల్లించాలి. అయితే మీకు ఇళ్లు కేటాయించకపోతే ఈ డబ్బులు వెనక్కి వస్తాయి. ఒకవేళ ఇల్లు కేటాయిస్తే లబ్దిదారుల వాటాలో సర్దుబాటు చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు ద్వారా అప్లై చేసుకోవాలి.

అర్హతలు ఏంటంటే..?

-పదేళ్లు క్యూఆర్ పరిధిలో ఖచ్చితంగా నివసించి ఉండాలి

-సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి ఉండకూడదు

-గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు

-ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి

-వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలి

ఇళ్ల విస్తీర్ణం ఎంతంటే..?

బహుళ అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించి లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం రూ.5 లక్షల రాయితీ అందించనుండగా.. లబ్దిదారుడు మిగతా రూ.6 లక్షలు చెల్లించాలి. ఇల్లు కేటాయింపు సమయంలో రూ.లక్ష, ఆర్‌సీసీ నిర్మాణ సమయంలో రూ.2 లక్షలు, ముగింపు దశలో రూ.2 లక్షలు, అప్పగించే సమయంలో మిగతా సొమ్ము చెల్లించాలి. వీటిని లబ్దిదారుడు విక్రయించడానికి కుదరదు.

Follow Us