MBNR to VIZAG Train: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

|

May 19, 2023 | 10:27 PM

మహబూబ్‌నగర్‌ను కోస్తా ఆంధ్రాతో నేరుగా అనుసంధానించే మొదటి రైలు పరుగులు పెట్టనుంది. మహబూబ్‌నగర్ - విశాఖపట్నం మధ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రయ్‌మంటూ దూసుకెళ్లనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మే 20వ తేదీన మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

MBNR to VIZAG Train: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Train
Follow us on

మహబూబ్‌నగర్‌ను కోస్తా ఆంధ్రాతో నేరుగా అనుసంధానించే మొదటి రైలు పరుగులు పెట్టనుంది. మహబూబ్‌నగర్ – విశాఖపట్నం మధ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రయ్‌మంటూ దూసుకెళ్లనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మే 20వ తేదీన మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ట్రైన్ నెంబర్ 12862 మహబూబ్‌నగర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు పాల్గొనున్నారు.

దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్ కీలకమైనది. రైల్వే నెట్‌వర్క్ కూడా అనుసంధానించబడింది. అయితే, ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ నుంచి కోస్తాంధ్రకు నేరుగా ట్రైన్ కనెక్టివిటీ లేదు. ఈ సమస్యను తీర్చి, ప్రయాణికులకు రవాణాను సుగమం చేసేందుకు గానూ.. రైల్వే మంత్రిత్వ శాఖ రైలు నెంబర్ 12861/12862 విశాఖపట్నం – కాచిగూడ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను 20 మే, 2023 నుండి మహబూబ్‌నగర్ వరకు పొడిగించేందుకు ఆమోదించింది. పొడిగించిన ఈ రైలు ద్వారా ప్రయాణికు నేరుగా మహబూబ్ నగర్ నుండి ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయనపాడు (విజయవాడ), ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం మొదలైన ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు.

ఈ రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉమ్దా నగర్ రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్ ఉంది. మహబూబ్‌నగర్ నుంచి కోస్తాంధ్రను కలుపుతూ వేసిన ఈ రైలు వల్ల చాలా మంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ ట్రైన్‌లో ఎల్‌హెచ్‌బి కోచ్‌లను కూడా యాడ్ చేశారు. ఇవి ఆధునిక సౌకర్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. రైలు నెంబర్ 12861/12862 విశాఖపట్నం – మహబూబ్‌నగర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమ్, స్టాప్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ట్రైన్ హాల్టింగ్స్ ఉన్న స్టేషన్స్ ఇవే..

మహబూబ్ నగర్

జడ్చర్ల

షాద్‌నగర్

ఉమ్దానగర్

కాచిగూడ

విశాఖపట్నం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..