G20 – Startup20: అత్యధిక స్టార్టప్‌లను కలిగి ఉన్న దేశాల్లో 3వ స్థానంలో భారత్: కిషన్ రెడ్డి
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లను కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం టాప్ 3లో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ యువత జాబ్ హోల్డర్స్‌లా కాకుండా..

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లను కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం టాప్ 3లో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ యువత జాబ్ హోల్డర్స్‌లా కాకుండా.. జాబ్ క్రియేటర్స్‌లా మారాలన్నారు. భారతదేశం అధ్యక్షత జరగనున్న జీ20 సమ్మిట్ కోసం దేశ వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటైన స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ రెండు రోజుల సమావేశం హైదరాబాద్‌లో శనివారం నాడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ ప్రసంగించారు.
ఇక ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్‌గా ప్రసంగించగా.. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు, అమితాబ్ కాంత్, స్టార్టప్ 20 చైర్‌మెన్ చింతన్ వైష్ణవ్, అనురాగ్ జైన్, జేఎస్ ఆశిష్ సిన్హా పాల్గొన్నారు. ఇక జీ20 సంభ్య దేశాల నుంచి 180 మంది ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




అమితాబ్ కాంత్ ప్రసంగిస్తూ.. ‘నేటి స్టార్టప్‌లు భారతదేశం సహా ప్రపంచ దేశాల్లోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. ఇంతకు ముందు భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ తెరవడానికి 8 నుంచి 9 నెలలు పట్టేది. కానీ, నేడు బయోమెట్రిక్‌ను ఉపయోగించి ఒక్క నిమిషంలోనే ఓపెన్ చేయడం సాధ్యం అవుతుంది. గత 4 సంవత్సరాల నుంచి యూఎస్, యూరప్, చైనా దేశాలతో పోలిస్తే ఇండియాలోనే వేగంగా ఆర్థిక పరమైన లావాదేవీలు జరుగుతున్నాయి.’ అని అన్నారాయన.
One Earth. One Family. One Future
Attended & addressed the inaugural of the #G20 #StartUp20 Inception Meeting in Hyderabad. Proud to witness India assuming the presidency of the #G20 and take the lead in promoting entrepreneurship and innovation.
| @G20Org |
1/5 pic.twitter.com/Sb2xsSUth5
— G Kishan Reddy (@kishanreddybjp) January 28, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..