Telangana: ‘సర్కారు దవాఖాన బేష్.. నా బిడ్డ, మనవడు బాగుండు సారూ’.. మంత్రి హరీష్‌కు సామాన్యుడి లేఖ..!

Telangana: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం..

Telangana: ‘సర్కారు దవాఖాన బేష్.. నా బిడ్డ, మనవడు బాగుండు సారూ’.. మంత్రి హరీష్‌కు సామాన్యుడి లేఖ..!
Harish Rao
Follow us

|

Updated on: Jul 05, 2022 | 9:44 PM

Telangana: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రులను ప్రత్యేక శ్రద్ధతో డవలప్ చేసిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది ప్రభుత్వం. దాంతో సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కాగా, సర్కార్ ఆస్పత్రుల్లో సౌకర్యాలను ప్రశంసిస్తూ ఓ సామాన్యుడు మంత్రి హరీష్ రావుకు లేఖ రాశారు. ‘నా బిడ్డ, మనవడు క్షేమంగా ఉన్నారు, నాకు మేలు జరిగినట్లే అందరికీ జరగాలి’ అంటూ మంత్రికి కృజ్ఞతలు తెలిపారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పోచయ్య బిడ్డ పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లాడు. వైద్యులకు చూపించారు. వారు ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం అనడంతో.. మంత్రి హరీష్ రావు టీవీల్లో చెప్పిన మాట విని సాధారణ కాన్పుకు సిద్ధం అయ్యాడు. ఓపిక పట్టి సాదరణ కాన్పు చేపించాడు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంతోషంలో మంత్రి హరీష్ రావుకి పోచయ్య, ఆయన బిడ్డ వసంత పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాసి పంపారు. వ్రాసి పంపారు.

‘‘సారూ.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులు ఉన్నాయని సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేసాడు. బాగా నొప్పులతో నా బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు మంచిగ చూసి. ఓపిక పట్టు సాధారణ కాన్పు చేపించుకో అన్నారు. మీరు( హరిశ్ రావు) టీవీల్లో చెపుతారు కదా సాధారణ కాన్పులు గురించి అని అలానే చేపించిన. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిర్ర. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంట్లో దింపిండ్రు. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి.. నాకు, బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను.. సార్.’ అంటూ.. ‘‘సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ఉన్నాయ్..! కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికె రావాలి..!! నాకు జరిగిన మేలు అందరికి జరగాలి.’’ అని లేఖలో పోచయ్య పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ లేఖపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ ఉత్తరం సాధారణ కాన్పులకు చైతన్యం అంటూ సంతోషం వ్యక్తం చేశారు మంత్రి. ‘‘సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేపించుకొని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను, అదేవిధంగా సాధారణ కాన్పులు చేపించుకోవాలని, నీకు జరిగిన మేలు అందరికి జరగాలని ఉత్తరం ద్వారా ఒక మంచి ఉపదేశం ఇచ్చారు. చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వసంత, పోచయ్య ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపాలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం మహిళలో, ప్రజల్లో గోప్ప చైతన్య స్పూర్తిని ఇస్తుంది.’’ అని మంత్రి హరీష్ సంతోషం వ్యక్తం చేశారు.

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్