Hyderabad: జోరా పబ్‌ ఓనర్‌ అరెస్ట్‌.. మొత్తం ఏడుగురికి రిమాండ్.. జూకు వన్యప్రాణుల తరలింపు

వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటుచేసిన జోరా పబ్‌ ఓనర్‌ వినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మేనేజర్‌ వరహాల నాయుడు, పబ్‌కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్‌ పెట్స్‌ ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: జోరా పబ్‌ ఓనర్‌ అరెస్ట్‌.. మొత్తం ఏడుగురికి రిమాండ్.. జూకు వన్యప్రాణుల తరలింపు
Wild Jungle Party

Updated on: May 30, 2023 | 9:03 PM

వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటుచేసిన జోరా పబ్‌ ఓనర్‌ వినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మేనేజర్‌ వరహాల నాయుడు, పబ్‌కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్‌ పెట్స్‌ ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక పబ్‌లోని వన్యప్రాణులను జూకు తరలించారు. కాగా పబ్బును జంతు ప్రదర్శనశాలగా మార్చేసింది సిటీలోని జోరా పబ్‌ యాజమాన్యం. చెట్లు, పుట్టలు లేదా జూలలో ఉండే అరుదైన సరీసృపాలను నేరుగా పబ్‌కే తీసుకొచ్చేశారు. డీజే సౌండ్స్‌ మధ్య వన్యప్రాణులను బెదరగొట్టేశారు కూడా. పాములు, తొండలు, అడవి పిల్లులు ఇలా చాలా ప్రాణుల్ని తెచ్చి.. పబ్‌ను ముంచెత్తేశారు. పబ్‌లో సరీసృపాలను చూసిన ఓ నెటిజన్‌ ఐఏఎస్‌ అధికారి అరవిందకుమార్‌కు ట్వీట్‌ చేయడంతో ఆయన పోలీసులను టాగ్‌ చేస్తూ రీట్వీట్‌ చేశారు. దాంతో జోరా పబ్‌ బాగోతం బయటకొచ్చింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ అటవీ అధికారులు సీన్‌లోకి వచ్చి పబ్‌ నిర్వాహకులు వినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు అన్ని లైసెన్సులు ఉన్నాయనేది పబ్‌ యాజమాన్యం మాట.

జంగిల్‌ థీమ్‌ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో ఎక్సోటిక్‌ యానిమల్స్‌ను పబ్‌లో ప్రదర్శించారు. వీటిని పెట్స్‌ దుకాణం నుంచి తెచ్చినట్టు గుర్తించారు. పబ్‌కు వచ్చిన వారిపై సరీసృపాలు దాడి చేయకుండా వాటికి పలు ఇంజెక్షన్లు ఇచ్చినట్టు సమాచారం. నెల క్రితం ఓ పబ్‌లో సైతం ఇదే విధంగా జంతువులను ప్రదర్శనకు పెట్టారు. ఆ పబ్‌ ఏర్పాట్లకు మంచి రెస్పాన్స్‌ రావడంతో జోరా పబ్‌ కూడా సీన్‌లోకి వచ్చింది. జోరా పబ్‌పై దుమారం రేగడంతో ఆ పబ్‌ వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది. కాగా మనుషులపై దాడి చేయకుండా పాములు, వన్యప్రాణులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.