Yuga Tulasi: గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం.. గోహత్యలు జరక్కుండా చూడాలని DGPకి వినతిపత్రం

గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బక్రీద్ సందర్భంగా గో హత్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని DGP మహేందర్ రెడ్డి..

Yuga Tulasi: గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం.. గోహత్యలు జరక్కుండా చూడాలని DGPకి వినతిపత్రం
Yugatukasi Min

Updated on: Jul 06, 2021 | 1:32 AM

గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బక్రీద్ సందర్భంగా గో హత్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని DGP మహేందర్ రెడ్డికి వినతి పత్రంను యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ చైర్మన్ విజయ రామ్ అందజేశారు. వీరు చేసిన డిమాండ్లకు DGP సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. పశువుల సంత జరిగే చోట నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లుగా వారు వెల్లడించారు. అంతే కాకుండా అలాంటి చోట నిఘాను ఏర్పాటు చేయాలిని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు రూపాల్లో తమ నిరసన తెలియసినట్లుగా శివకుమార్ తెలిపారు. ప్రతి ఏటా తాము విజ్ఞప్తులు చేస్తున్నామని గుర్తుచేశారు శివకుమార్.

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలను మూసివేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఉద్యమాలు చేస్తూ వస్తోంది. గోమాత ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది యుగతులసి ఫౌండేషన్.

ముక్కోటి దేవతలు ఒక్క జంతువులో కొలువై ఉన్నాయని అంటే అదీ గోమాత అని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలాంటి గో మాతను అక్రమంగా కబేళాలకు తరలించడం, చంపి తినడం మానవత్వమే కాదని కోరుతోంది. అలాంటి వాటిని అరికట్టాలన్న లక్ష్యంతోనే ఈ ఉద్యమం నిర్వహిస్తోంది యుగ తులసి ఫౌండేషన్. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది.

ఇవి కూడా చదవండి: Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎవరున్నారంటే..!

Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..