Telangana: ‘బై మమ్మీ లవ్యూ జాగ్రత్త’.. పబ్‌జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

| Edited By: Basha Shek

Jan 06, 2024 | 10:08 PM

2018లో అఖిల్ నాన్న చనిపోవడంతో అమ్మతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని తల్లి జయ బయటకు వెళ్లి వచ్చేసరికి లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. వాచ్ మ్యా న్ సహాయంతో డోర్ బద్దలు కొట్టగా లోపల ఉరివేసుకున్న కుమారుడు కనిపించాడు.

Telangana: బై మమ్మీ లవ్యూ జాగ్రత్త.. పబ్‌జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
Pubg Game
Follow us on

పబ్​జీ గేమ్​కు బానిసై ఓ స్టూడెంట్​ఆత్మహత్య​ చేసుకున్నాడు. హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడకు చెందిన అఖిల్ ( 21) డిగ్రీ చదువుతున్నాడు. మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకుండా పబ్​జీ గేమ్​కు బాగా బానిసయ్యాడు. 2018లో అఖిల్ నాన్న చనిపోవడంతో అమ్మతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని తల్లి జయ బయటకు వెళ్లి వచ్చేసరికి లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. వాచ్ మ్యా న్ సహాయంతో డోర్ బద్దలు కొట్టగా లోపల ఉరివేసుకున్న కుమారుడు కనిపించాడు. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ‘బై మమ్మీ లవ్ యు జాగ్రత్త” అని నా కొడుకు అఖిల్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వెంటనే నేను నా కొడుక్కి ఫోన్ చేసాను కానీ అతను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను ఇంటికి వెళ్లేసరికి మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. అయితే వాచ్‌మెన్ ఉపేంద్ర ఇతరుల సహాయంతో మెయిన్ డోర్ తెరిచారు. అఖిల్ బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ ఉన్నాడు’

‘వెంటనే మా కుమారుడిని కిందకు దించి ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అయితే అప్పటికే నా కుమారుడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ‘నా కొడుకు PUB-G గేమ్‌కు బానిస అయ్యాడు. 3 నెలల నుండి కాలేజీకి వెళ్లడం లేదు’ అని ఆవేదనతో చెప్పుకొచ్చింది అఖిల్‌ తల్లి. కాగా ఈ సంఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..