హైదరాబాద్‌లో నిరుపయోగంగా వాటర్ ఏటీఎంలు

నగర ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్‌ ఏటీఎంలు నిరుపయోగంగా మారాయి. ర‌ద్దీ ప్రాంతాల‌లో పాద‌చారులు, ప్రయాణీకులు తాగేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు పనిచేయక ప్రజలు అవ‌స్థలు ప‌డుతున్నారు. నగరంలో ఎనీటైం వాటర్‌ మిషన్ల ఏర్పాటులో శ్రద్ధ చూపిన జీహెచ్‌ఎంసీ…నిర్వహణ తీరును పర్యవేక్షించడం మరిచిపోయింది. దీంతో మినరల్‌ వాటర్‌ లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చాలా చోట్ల వాటర్‌ ఏటీఎంల వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వాన్నంగా తయారయ్యాయి. కొన్ని […]

హైదరాబాద్‌లో నిరుపయోగంగా వాటర్ ఏటీఎంలు
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 7:11 AM

నగర ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్‌ ఏటీఎంలు నిరుపయోగంగా మారాయి. ర‌ద్దీ ప్రాంతాల‌లో పాద‌చారులు, ప్రయాణీకులు తాగేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు పనిచేయక ప్రజలు అవ‌స్థలు ప‌డుతున్నారు.

నగరంలో ఎనీటైం వాటర్‌ మిషన్ల ఏర్పాటులో శ్రద్ధ చూపిన జీహెచ్‌ఎంసీ…నిర్వహణ తీరును పర్యవేక్షించడం మరిచిపోయింది. దీంతో మినరల్‌ వాటర్‌ లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చాలా చోట్ల వాటర్‌ ఏటీఎంల వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వాన్నంగా తయారయ్యాయి. కొన్ని సంస్థలకు ప్రత్యేకంగా ఈ కియోస్క్‌ల ఏర్పాటుకు అనుమతినివ్వడంతోపాటు…స్థలం కూడా జీహెచ్‌ఎంసీ కేటాయించింది. జలమండలి నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ, రవాణా మాత్రం నిర్వాహకులే చూసుకోవాలని కండిషన్ పెట్టింది. దీంతో చాలాచోట్ల నిర్వాహకులు నిర్వహణను వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు సదుపాయం కల్పించాల్సిన ప్రభుత్వ విభాగాలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.