హైదరాబాద్‌లో మరో దారుణం.. చిన్నారిపై వీధి కుక్క అటాక్‌. సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలు.

ఇటీవల హైదరాబాద్‌లో వీధి కుక్కుల బారిన పడి మరణించిన నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అభంశుభం తెలియని నాలుగేళ్ల కుర్రాడు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా కలిచి వేసింది...

హైదరాబాద్‌లో మరో దారుణం.. చిన్నారిపై వీధి కుక్క అటాక్‌. సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలు.
Dog Attack
Follow us

|

Updated on: Mar 25, 2023 | 5:21 PM

ఇటీవల హైదరాబాద్‌లో వీధి కుక్కుల బారిన పడి మరణించిన నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అభంశుభం తెలియని నాలుగేళ్ల కుర్రాడు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా కలిచి వేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పలు చోట్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యాయి. దీంతో అధికారుల తీరుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ప్రజలు. దీంతో అధికారులు ఉన్నపలంగా రంగంలోకి దిగి వీధి కుక్కలను కంట్రోల్‌ చేసే పనిలో పడ్డారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా వీధి కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు.

తాజాగా హైదరాబాద్‌లోనే మరో దారుణ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని బడంగ్ పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో విధి కుక్క స్వైర విహారం చేసింది. శనివారం టీచర్స్‌ కాలనీలో నడుచుకుంటూ వెళుతోన్న ఓ 5 ఏళ్ల కుర్రాడిపై వీధి కుక్క ఒక్కసారిగా అటాక్‌ చేసింది. దీంతో ఆ చిన్నారి కిందపడిపోయాడు. దీంతో బాలుడు ఒక్కసారిగా అరడంతో స్థానికంగా ఉన్న వాళ్లు విని బాబును కాపాడారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే చిన్న పిల్లలు టార్గెట్‌గా కుక్కల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి కాలం ఎండలు తీవ్రత కారణంగానే వీధి కుక్కలు ఇలా ప్రవరిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కుక్కలు ఇలా చిన్నారులపై దాడులు చేస్తున్న అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..